ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy : ఎస్ఎల్బీసీలో అవసరమైతే రోబోలను వాడుతాం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Mar 03 , 2025 | 06:43 AM

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటన కేస్ స్టడీగా తీసుకోవాలని అన్నారు. ఈ ఘటన ఓ విపత్తు.. ఓ ప్రమాదమని ఆయన తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ క్రమంలో టన్నెల్‌లోకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులను ఆయన ఆరా తీశారు. అలాగే సహాయక చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

1/9

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదాన్ని రాజకీయం చేయటం తగదని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు.

2/9

నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట దగ్గర విలేకరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వెంట మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు.

3/9

గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టిందని విమర్శించారు.

4/9

ఆ సమయంలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని.. అయితే ఈ ప్రమాద ఘటన స్థలికి వెళ్తామంటే నాటి ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. పనులు చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

5/9

ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ కొనసాగాలని.. ఎస్ఎల్బీసీలో అవసరమైతే రోబోలను వాడుతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

6/9

పనులు చేస్తున్న సంస్థకు గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు బిల్లులు చెల్లించలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

7/9

పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్‌ సరఫరా కూడా ఆపేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

8/9

బోరింగ్‌ మిషన్‌కు విడిభాగాలు కూడా సమకూర్చలేదని చెప్పారు. పనులు చేస్తున్నప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదం ఇదని అన్నారు.

9/9

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని.. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Updated Date - Mar 03 , 2025 | 06:52 AM