Stress Management: ఇలా చేస్తే ఒత్తిడిపై విజయం
ABN, Publish Date - Oct 28 , 2025 | 10:40 PM
ఒత్తిడిని జయించి విజయం వైపు దూసుకెళ్లేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం
ఒత్తిడిని బలహీనతగా కాకుండా విజయానికి అవకాశంగా, జీవితంలో ఎదుగుదలకు సంకేతంగా భావించాలి.
దృఢచిత్తం అలవరుచుకునేందుకు ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి. ఇతరత్రా ఆలోచనలను వదిలిపెట్టి ఆ క్షణంలో చేస్తున్న పనిపైనే దృష్టి పెట్టాలి.
అతిగా బాధ్యతలను నెత్తిమీద వేసుకోకుండా మీకోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ముఖ్యమైన విషయాలపైనే దృష్టిపెట్టాలి
అవసరంలో ఉన్నప్పుడు మొహమాట పడకుండా స్నేహితులు, లేదా ఆఫీసులో సహచరులు, బాస్‌ల సహాయం తీసుకోవాలి
పనితో పాటు మానసిక, శారీరక విశ్రాంతికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి
ఒత్తిడి ఎదురైనప్పుడు పూర్తిగా చతికిలపడిపోకుండా క్షణ కాలం పాటు తమాయించుకుని ముందడుగు వేస్తే విజయం దానంతట అదే సిద్ధిస్తుంది.
ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. నేను కఠిన పరిస్థితులను ఎదుర్కోగలను అని మననం చేసుకుంటే దృఢచిత్తం క్రమంగా అలవడుతుంది.
Updated Date - Oct 28 , 2025 | 10:43 PM