రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంత సింపుల్ ఫుడ్ తింటాడా?..
ABN, Publish Date - Dec 04 , 2025 | 02:52 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారతదేశంలో పర్యటించనున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ఇండియాకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా పుతిన్ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారతదేశంలో పర్యటించనున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ఇండియాకు వస్తున్నారు.
పర్యటనలో భాగంగా పుతిన్ పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.
పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పుతిన్ తినే ఆహారంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పుతిన్ తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారట.
బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా టోవోరాగ్ (కాటన్ చీజ్, తేనె కలిసి తయారు చేసే వంటకం)ను ఇష్టం తింటారట.
కౌజు పిట్ట గుడ్లు, తాజా పళ్లతో చేసే జ్యూస్, ప్రొటీన్ కోసం చేపల్ని ఎక్కువగా తింటారట.
స్టర్‌జియన్ చేప, గొర్రె పిల్ల మాంసం అంటే పుతిన్‌కు చాలా ఇష్టమట.
చక్కెరతో తయారు చేసే ఆహార పదార్థాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా దూరంగా ఉంటారట.
Updated Date - Dec 04 , 2025 | 03:13 PM