Jaipur Gemstone Business: రాజస్థాన్ జైపూర్లో రోడ్లపై కుప్పలుగా పోసి రత్నాల వ్యాపారం..ఎగబడుతున్న జనం
ABN, Publish Date - Sep 25 , 2025 | 12:48 PM
Jewelry Business Roadside in Jaipur Rajasthan with Piles of Gemstones sri Jaipur Gemstone Business: రాజస్థాన్ జైపూర్లో రోడ్లపై కుప్పలుగా పోసి రత్నాల వ్యాపారం..ఎగబడుతున్న జనం
రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో రోడ్లపైనే రత్నాల మార్కెట్ జరుగుతుంది. అక్కడ వ్యాపారులు కుప్పలు కుప్పలుగా రాళ్లను రోడ్డు పక్కను పోసి అమ్ముతారు.
సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య కూరగాయల స్టాల్స్ మాదిరిగా రోడ్డు, బండ్లపై వ్యాపారం కొనసాగుతుంది
షోరూమ్‌లు లేకుండానే లక్షల రూపాయల విలువైన లావాదేవీలు జరుగుతాయి. ఇది వందల మందికి జీవనోపాధిగా మారింది
వాల్డ్ సిటీ ప్రాంతంలో జోహారీ బజార్ ఆభరణాల కేంద్రం, చుట్టుపక్కల రత్నాలు పాలిష్ చేసే వర్క్‌షాప్‌లు కూడా ఉంటాయి
నవాబ్ స్క్వేర్ వద్ద అర కిలోమీటరు దూరంలోనే ఈ రత్నాల మార్కెట్ ఉంటుంది. రోడ్డుపై వీటిని కొనుగోలుదారులు ఎగబడి కొంటారు
ముడి రాళ్లు, విలువైన రత్నాలు ఇక్కడ చూడవచ్చు. వ్యాపారులు వాటిని చేతుల్లో పట్టుకుని చూపిస్తారు
కొనుగోలుదారులు రాళ్లను పరిశీలిస్తూ, బేరసారాలు చేస్తారు, చుట్టూ జనసందోహం ఉంటుంది.
అనేక సంవత్సరాలుగా ఈ మార్కెట్ కొనసాగుతున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు
Updated Date - Sep 25 , 2025 | 12:49 PM