Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు
ABN, Publish Date - Nov 23 , 2025 | 07:54 AM
భారతీయ కళా మహోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఆకట్టుకునే ప్రదర్శనలను ఇచ్చారు.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలకు చెందిన వారు కళా ప్రదర్శనలను ఇచ్చారు.
రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలను ఇచ్చారు.
మొత్తం 250 మంది కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. వీరిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.
సంప్రదాయ నృత్యరీతులతో పాటు ఢోల్ టాషా, లెజిమ్, కల్బేలియా, వంటి జానపద నాట్య రీతుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, టెక్స్‌టైల్స్ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయంలో తొమ్మిది రోజుల పాటు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
ఈ మహోత్సవం ఈశాన్య రాష్ట్రాల కళావైభవానికి అద్దం పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పశ్చిమ రాష్ట్రాల కళాప్రదర్శనలు ఈసారి హైలైట్‌గా నిలిచాయని అన్నారు.
తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం, కళానైపుణ్యాల గొప్పదనాన్ని ఈ మహోత్సవం చాటిచెప్పిందని రాష్ట్రపతి అన్నారు.
భారత సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ ఈవెంట్ కల్పించిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
ఈ ఈవెంట్ ద్వారా భారత దేశ సంస్కృతిపై యువతకు అవగాహన పెంచుకునే అవకాశం దక్కిందని కూడా రాష్ట్రపతి ముర్ము అన్నారు.
Updated Date - Nov 23 , 2025 | 08:00 AM