Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షణ.. భారీగా పాల్గొన్న భక్తులు
ABN, Publish Date - Oct 22 , 2025 | 10:59 AM
కర్తీక మాసం ప్రారంభం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రంలో బుధవారం భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవోతోపాటు భారీగా భక్తులు పాల్గొన్నారు.
కర్తీక మాసం ప్రారంభం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రంలో బుధవారం భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.
ఆలయ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దంపతులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవోతోపాటు భారీగా భక్తులు పాల్గొన్నారు.
కొండపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మూలమూర్తులను దర్శించుకుని భక్తులు అనంతరం ఆవు నెయ్యితో దీపాలను వెలిగించారు.
కార్తీక మాసం ప్రారంభం కావడంతో యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తుతున్నారు.
భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - Oct 22 , 2025 | 11:00 AM