నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు..
ABN, Publish Date - Apr 06 , 2025 | 05:21 PM
శ్రీరామనవమి వేడుకలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రసిద్ధ రామాలయాల్లో కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణ కనుల పండువగా జరిగింది.
కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రత్యేక అలంకరణలో సీతారామలక్ష్మణులు
పెద్ద పెద్ద పందిళ్లు వేసి, వాటి కింద కల్యాణ వేదికలు నిర్మించారు. శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు
రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా, కనుల పండువగా జరిగింది.
Updated Date - Apr 06 , 2025 | 05:21 PM