తొలి ఏకాదశి వేళ అంగరంగ వైభవంగా బీరన్న బోనాలు..
ABN, Publish Date - Jul 06 , 2025 | 08:19 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
తెలంగాణ వ్యాప్తంగా బీరన్న బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
'డిల్లెం బల్లెం' అంటూ డప్పుచప్పుళ్లతో బీరన్న దేవాలయానికి మహిళలు పెద్దఎత్తున బోనాలతో వెళ్లారు.
ఈ సందర్భంగా బీరన్నకు మెుక్కులు చెల్లించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు.
ఇవాళ(ఆదివారం) భూపాలపల్లిలో జరిగిన బోనాల వేడుకలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
కాగా, ప్రతి ఏటా తొలి ఏకాదశి రోజున కురుమలు సంప్రదాయబద్ధంగా బీరన్న బోనాలను జరుపుకుంటారు.
Updated Date - Jul 06 , 2025 | 08:19 PM