ఘనంగా తిరుపతి బాలోత్సవం.. అలరించిన చిన్నారులు
ABN, Publish Date - Nov 01 , 2025 | 06:14 PM
తిరుపతిలోని SGS ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం తిరుపతి బాలోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి బాలోత్సవం పేరిట ఈ ఏడాది నాల్గవసారి కూడా 'రెండు రోజుల పిల్లల పండుగ' శనివారం ఉదయం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని SGS ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం తిరుపతి బాలోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి బాలోత్సవం పేరిట ఈ ఏడాది నాల్గవసారి కూడా 'రెండు రోజుల పిల్లల పండుగ' ఈరోజు ఉదయం ప్రారంభమైంది.
రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా ఉన్నాయంటూ అభినందించారు. తిరుపతి బాలోత్సవం గొప్పగా ఉందని.. ఇన్ని వేల మందిని ఒకచోటికి తీసుకుని రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ తరహా కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించే విధంగా సహకారం అందిస్తామని చెప్పారు. విద్యార్థులకు చదువులతో పాటు కళలు, క్రీడల్లోనూ ప్రావీణ్యం ఉంటుందని పేర్కొన్నారు.
వారిలోని ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడతాయని అన్నారు. నిత్యం చదువులకే పరిమితం కాకుండా, వారిలో ఉన్న ప్రతిభకు తగినట్లు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు సూచించారు.
Updated Date - Nov 01 , 2025 | 08:51 PM