Tiruchanur Padmavati Temple: ఘనంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు..
ABN, Publish Date - Nov 17 , 2025 | 10:22 AM
కార్తీక బ్రహ్మోత్సవాల కోసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముస్తాబయింది. విద్యుత్ దీపాల కాంతులతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలటం లేదు.
కార్తీక బ్రహ్మోత్సవాల కోసం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముస్తాబయింది.
విద్యుత్ దీపాల కాంతులతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలటం లేదు.
కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25 వరకు వైభవంగా జరుగనున్నాయి.
ప్రత్యేక వాహన సేవలు, పట్టు వస్త్ర సమర్పణ ప్రధాన ఆకర్షణ.
వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ కార్యక్రమంతో శుభారంభం కానుంది.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి.
నవంబర్ 17 ఉదయం 8 నుండి 9 గంటల మధ్య ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకార కార్యక్రమాలు జరుగుతాయి.
ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణం జరుగుతాయి.
ప్రతి సంవత్సరం అత్యంత ఆధ్యాత్మికంగా నిర్వహించే ఈ వేడుకలు భక్తులకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి.
Updated Date - Nov 17 , 2025 | 10:22 AM