ప్రతీ మనసును తట్టిలోపే అద్భుత దృశ్యాలు..
ABN, Publish Date - Dec 24 , 2025 | 09:37 PM
ఈ సృష్టిలో తల్లిని మించి దైవం లేదంటే అతిశయోక్తి లేదు. ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయదు. తను పస్తు ఉండి బిడ్డల కడుపు నింపుతుంది. ఓ తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ,మమకారం ఈ ఫోటో నిదర్శనం. రాళ్లను కొడుతూ రామాంజినమ్మ అనే మహిళ బిడ్డ ఆలనా పాలనా చూస్తోంది.
ఈ సృష్టిలో తల్లిని మించి దైవం లేదంటే అతిశయోక్తి లేదు. ఓ తల్లి తన బిడ్డ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయదు. తను పస్తు ఉండి బిడ్డల కడుపు నింపుతుంది.
ఓ తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ,మమకారం ఈ ఫోటో నిదర్శనం. రాళ్లను కొడుతూ రామాంజినమ్మ అనే మహిళ బిడ్డ ఆలనా పాలనా చూస్తోంది.
చిత్తూరు నరిగపల్లె గ్రైనేట్ ఫ్యాక్టరీ సమీపంలో తన భర్త వెంకటేష్‌తో కలిసి రాళ్లు కొడుతూ ఉంది. తల్లీబిడ్డల ప్రేమకు సంబంధించిన ఆ దృశ్యాలను అనంతపురం ఫొటోగ్రాఫర్ శివ తన కెమెరాలో బంధించారు.
ప్రకృతి అందాలను ఎంత చూసినా తనివి తీరదు. సాయం సంధ్య వేళలో పక్షుల కిలకిలారావాలు వింటుంటే ఆ తృప్తే వేరు.
ఆహార వేటలో అలసిపోయిన పక్షులు సాయంత్రం కాగానే గూటికి చేరుకోవటానికి పరుగులు తీస్తున్న దృశ్యాలు ఇవి.
కన్నులవిందు కలిగించే ఈ అద్భుతమైన దృశ్యాలను కర్నూలు ఫొటోగ్రాఫర్ షేక్ మహ్మద్ రఫి తన కెమెరాలో బంధించారు.
మానవత్వం పరిమళించిన సంఘటన ఇది. రోడ్డుపై పడ్డ పెద్ద రంధ్రం కారణంగా వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఓ వ్యక్తి ఇలా ఆ రంధ్రంలో కర్రను ఉంచాడు. తన మంచి తనాన్ని చాటి చెప్పాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ దృశ్యాలను బెంగళూరు ఫొటో గ్రాఫర్ కే రవి తన కెమెరాలో బంధించారు.
Updated Date - Dec 24 , 2025 | 09:37 PM