Simhachalam Tragedy: సింహాచలం ఘటన.. కేజీహెచ్ వద్ద బంధువుల రోదనలు
ABN, Publish Date - Apr 30 , 2025 | 10:40 AM
Simhachalam Tragedy: సింహాచలం అప్పన్న ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. చందనోత్సవం సందర్భంగా టికెట్ల కోసం వేచి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
సింహాచలం ఘటన.. కేజీహెచ్ వద్ద బంధువుల రోదనలు
సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు
శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు
కేజీహెచ్ మార్చురీ వద్ద రోధిస్తున్న మృతి చెందిన వెంకట్రావు బంధువులు
విశాఖ కేజీహెచ్ వద్ద మృతి చెందిన వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.
దర్శనానికి వచ్చి ఇలా తమ వారిని పోగొట్టుకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కేజీహెచ్ మార్చురీ వద్ద మృతి చెందిన భార్యాభర్తలు మహేష్, శైలజ బంధువుల రోదన
మృతుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు భార్యాభర్తలు ఉమా మహేష్, శైలజ, వెంకటరత్నం, మహాలక్ష్మి వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన పత్తి దుర్గా స్వామి నాయుడు , మణికంఠ మృతి చెందారు
Updated Date - Apr 30 , 2025 | 10:49 AM