ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cheermenu Fish: చీరమేను కోసం పోటెత్తిన మాంసాహార ప్రియులు..

ABN, Publish Date - Oct 17 , 2025 | 09:20 AM

దీపావళి రోజుల్లో గోదావరి, సముద్ర సంగమ ప్రాంతంలో లభించే అరుదైన చేప చీరమేను. దీని కోసం శుక్రవారం యానాంకు మాంసాహార ప్రియులు పోటెత్తారు.

1/7

దీపావళి రోజుల్లో గోదావరి, సముద్ర సంగమ ప్రాంతంలో లభించే అరుదైన చేప చీరమేను. దీనిని కొనుగోలు చేసేందుకు శుక్రవారం యానాంకు మాంసాహార ప్రియులు పోటెత్తారు.

2/7

దీంతో సెరు చీరమేను ధర రూ. 16 వేల వరకు పలికింది. పెద్దదారం సైజులో ఉండే చీరమేనును మత్స్యకారులు లీటర్ల లెక్కన విక్రయిస్తారు.

3/7

తూర్పు గాలులు వీచే వేళ.. సముద్రం, గోదావరి నది కలిసే ప్రాంతంలో ఇది లభిస్తుంది. ఈ సమయంలో నీటి అడుగు భాగం నుంచి అవి నీటిపైకి చేరుకొంటాయి.

4/7

ఈ చీర మేనను ఈ రోజు మత్స్యకారులు భారీగా మార్కెట్‌కు తీసుకు వచ్చారు. దాంతో స్థానిక రాజీవ్ బీచ్‌లోని పుష్కర్ ఘాట్ వద్ద సందడి వాతరవరణం నెలకొంది.

5/7

శీతాకాలం ప్రారంభంలో.. మరి ముఖ్యంగా దీపావళి ముందు దశమి, ఏకాదశ రోజుల్లో ఈ చీరమేను లభ్యమవుతుంది. వీటిని కొనుగోలు చేసేందుకు మాంసహార ప్రియులు పోటీ పడ్డారు. గత రెండు రోజుల క్రితం సెరు రూ. రెండు వేలకుపైగా విక్రయించారు.

6/7

ప్రస్తుతం సెరు ధర రూ.1,600కు విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల పాటు చీరమేను లభ్యమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ చీరమేనుకు మసాలా దట్టించి వేపుడుగా చేస్తారు.

7/7

అలాగే చింతకాయ తొక్కుతో కూరగా కూడా వండుకుంటారు. దీనిని గారెలతో కలిపి తినేందుకు మాంసాహార ప్రియులు అమితంగా ఇష్ట పడతారని చెబుతారు.

Updated Date - Oct 17 , 2025 | 09:30 AM