Montha Cyclone Hits Andhra Pradesh: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. భారీ సంఖ్యలో నేల కొరిగిన చెట్లు..
ABN, Publish Date - Oct 28 , 2025 | 06:55 PM
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాన్ అలజడి సృష్టిస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ చెట్లు నేల కొరుగుతున్నాయి. రావులపాలెం నుండి కొత్తపేటకు వెళ్లే రహదారిపై వృక్షాలు నేలకొరిగాయి. పంచాయతీ సిబ్బంది జేసీబీల సాయంతో నేల కొరిగిన చెట్లను తొలగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాన్ అలజడి సృష్టిస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ చెట్లు నేల కొరుగుతున్నాయి.
రావులపాలెం జొన్నాడ సమీపంలో జాతీయ రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తున్న హైవే సిబ్బంది.
రోడ్డుపై పడ్డ భారీ వృక్షాన్ని జేసీబీ సాయంతో పక్కకు తొలగిస్తున్న హైవే సిబ్బంది.
రావులపాలెం గోదావరి బ్రిడ్జిపై తుఫాను వాతావరణ పరిస్థితి.
మొంథా తుపాన్ ప్రభావంతో భీకరంగా మారిపోయిన మేఘాలు.
రావులపాలెం నుండి కొత్తపేటకు వెళ్లే రహదారిపై వృక్షాలు నేలకొరిగాయి.
పంచాయతీ సిబ్బంది జేసీబీల సాయంతో నేల కొరిగిన చెట్లను తొలగించారు.
రోడ్డుపై చెట్లు విరిగిపడ్డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి.
Updated Date - Oct 28 , 2025 | 06:56 PM