WhatsApp Governance:ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి ..
ABN, Publish Date - Jan 30 , 2025 | 09:56 PM
‘మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం’’ వాట్సాప్ గవర్నెన్స్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం నాడు ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధ్రువపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటుంది.
వాట్సాప్ సేవల కోసం నెంబర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను వినియోగించుకోవాలని ప్రకటించింది.
దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
మొదటి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా ఏపీ ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లో ఈ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.
వాట్సాప్ గవర్నెన్స్‌తో సులభంగా సమస్యల పరిష్కారం చేసుకోవచ్చని, యువగళం పాదయాత్రలోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
Updated Date - Jan 30 , 2025 | 09:56 PM