ప.గో. జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన చిత్రాలు..
ABN, Publish Date - Jan 07 , 2025 | 10:47 AM
ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటన విజయవంతమైంది. పర్యటన ఆద్యంతం సందడిగా రాజకీయాలకతీతంగా మంత్రి పర్యటన సాగింది. తొలుత ఉండి జడ్పీ హైస్కూల్‌లో పునఃనిర్మించిన భవనాన్ని ప్రారంభించి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం పెద అమిరంలోని రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం, భీమవరంలలో మంత్రి నారా లోకేష్ పర్యటన
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నియోజకవర్గం ఉండిలో హైస్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్..
పెద అమిరంలోని పారిశ్రామికవేత్త రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు.
ఉండి జడ్పీ హైస్కూల్‌లో పునఃనిర్మించిన భవనాన్ని ప్రారంభత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి లోకేష్..
ఉండి జడ్పీ హైస్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి నారా లోకేష్...
విద్యార్థినిలుతో మమేకమైన మంత్రి నారా లోకేష్ ...
పశ్చిమగోదావరి జిల్లా నేతలతో మంత్రి లోకేష్.. చిత్రంలో కూటమి నేతలు...
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్‌కు మెమెంటో బహూకరిస్తున్న టీడీపీ నేతలు...
Updated Date - Jan 07 , 2025 | 10:48 AM