Grand Pushpaharam Ceremony: తిరుమలలో ఘనంగా పుష్పయాగం..
ABN, Publish Date - Oct 30 , 2025 | 06:32 PM
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్ప యాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది.
పుష్పయాగానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు.
స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహించారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ నేపథ్యంలో ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన టీటీడీ ఈవో అనిల్ కుమార్
అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం
శ్రీవారి పుష్పయాగానికి తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళం ఇచ్చారు.
Updated Date - Oct 30 , 2025 | 06:38 PM