పుట్టపర్తి చేరుకున్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Nov 18 , 2025 | 08:22 PM
పుట్టపర్తి సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
హిందూపురం జిల్లా పుట్టపర్తి సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.
మంగళవారం సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ చేరుకున్నారు.
సీఎం చంద్రబాబుకు అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు నేతలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రికి పుట్టపర్తిలోనే సీఎం చంద్రబాబు, లోకేశ్ బస చేయనున్నారు.
రాష్ట్రప్రభుత్వంతో పాటు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు.
రేపు శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొనున్నారు. ఈ ఉత్సవాలు నారాయణ సేవతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు రథోత్సవం సైతం నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ, గోవిందరావు, కల్యాణ్ చక్రవర్తిలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
Updated Date - Nov 18 , 2025 | 08:23 PM