CM Chandrababu: వాసవి కన్యకాపరమేశ్వరి ప్రత్యేక పూజల్లో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 31 , 2025 | 05:07 PM
పశ్చిమ గోదావరి జిల్లాలో గల పెనుగొండలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమం శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
కలియుగ పార్వతీదేవిగా అహింసా, శాంతి, సంపద గురించి చాటి చెప్పిన దేవతా వాసవి కన్యకా పరమేశ్వరి అని సీఎం చంద్రబాబు తెలిపారు.
2600 ఏళ్ల క్రితం అహింస జరగకూడదని 102 మంది గోత్రీకులతో ఆత్మార్పణ చేసుకున్న మహిమ గల అమ్మవారు అని సీఎం చంద్రబాబు చెప్పారు.
కలియుగ పార్వతీదేవిగా అహింసా, శాంతి, సంపద గురించి వాసవి కన్యకాపరమేశ్వరి చాటి చెప్పారని సీఎం అన్నారు.
దేశ వ్యాప్తంగా ఆర్యవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని సీఎం చంద్రబాబు తెలిపారు.
తొలిసారిగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ వారిని దర్శించుకోవడం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆర్యవైశ్యులు సమాజంలో కష్టపడి పనిచేసి నీతి నిజాయితీగా సంపాదించిన సంపాదనలో సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయటం వారి రక్తంలోనే ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఆర్యవైశ్యులు ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి తెలివితేటలతో అభివృద్ధి పరచాలన్నది ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీని చల్లగా చూడాలని ఆ కన్యకా పరమేశ్వరుని మొక్కుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పెనుగొండ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Jan 31 , 2025 | 05:10 PM