Bhagawan Sri Sathya Sai Baba: అత్యంత ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జయంతి వేడుకలు
ABN, Publish Date - Nov 23 , 2025 | 07:17 PM
భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, బాబా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు.
ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు.
జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు.
ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు.
1940 మే 23వ తేదీన సత్యసాయి వయసు 14 ఏళ్లు... అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు.
శ్రీ సత్య సాయి బాబా మతం, ప్రాంతం, దేశాలకు అతీతంగా ఆయన మానవత్వాన్ని చాటిచెప్పారు.
శ్రీ సత్యసాయి బాబా శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు ప్రతిరూపంగా నిలిచారు.
Updated Date - Nov 23 , 2025 | 07:18 PM