AP DGP: విజయనగరంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పర్యటన
ABN, Publish Date - Jan 28 , 2025 | 09:39 PM
విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా పని చేయాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
విజయనగరంలో మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు పర్యటించారు.
డీజీపీ ద్వారక తిరుమల రావును మర్యాద పూర్వకంగా జిల్లా ఉన్నత అధికారులు కలిశారు.
డీజీపీని సన్మానించి, జ్ఞాపికను రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అందజేశారు.
పచ్చదనానికి ప్రతీకగా జిల్లా పోలీసు కార్యాలయంలో మొక్కును డీజీపీ ద్వారకా తిరుమల రావు నాటారు.
ఉత్తరాంధ్రలో గంజాయి నిర్మూలన, డ్రగ్ కంట్రోల్ చేయడమే ప్రధాన లక్ష్యమని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డీజీపీ తెలిపారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు డీజీపీ తిరుమల రావు వార్నింగ్ ఇచ్చారు.
డిజిటల్ అరెస్టు ద్వారా ఫోన్ , వీడియో కాల్స్ ద్వారా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
డిజిటల్ అరెస్టు అనేది అసలు లేదని డీజీపీ తిరుమల రావు స్పష్టం చేశారు.
Updated Date - Jan 28 , 2025 | 09:39 PM