ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Warning: ఎయిర్‌పోర్టులో భారతీయ విద్యార్థికి బేడీలు.. మరో వార్నింగ్ ఇచ్చిన అమెరికా

ABN, Publish Date - Jun 10 , 2025 | 04:41 PM

నెవార్క్ ఎయిర్‌పోర్టులో భారతీయ విద్యార్థి అరెస్టు వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో భారత్‌లోని అమెరికా ఎంబసీ స్పందించింది. వీసా నిబంధనలను అతిక్రమించే వారిని అస్సలు సహించబోమని స్పష్టం చేసింది.

US visa abuse warning

ఇంటర్నెట్ డెస్క్: నెవార్క్ ఎయిర్‌పోర్టులో భారతీయ విద్యార్థికి బేడీలు వేసి స్వదేశానికి తరలించిన ఘటన తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా ఎంబసీ తాజాగా స్పందించింది. వీసాను దుర్వినియోగ పరిచినా, అక్రమంగా అమెరికాకు వచ్చినా అస్సలు సహించబోమని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే వారిని స్వాగతిస్తామని పేర్కొంది. అయితే, అమెరికా పర్యటన అనేది హక్కుగా భావించొద్దని స్పష్టం చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించే వారిని సహించబోమని పేర్కొంది.

అమెరికాలోని నెవార్క్ ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది ఓ భారతీయ విద్యార్థిని నేలపై అదిమిపెట్టి చేతులకు బేడీలు వేసి అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. కునాల్ జైన్ అనే ఎన్నారై ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. సదరు భారతీయ విద్యార్థి హర్యాన్వీలో మాట్లాడుతున్నట్టు తెలిపారు. అతడిని అధికారులు మతిస్థిమితం లేని వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించిందన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని యువకుడు చెప్పే ప్రయత్నం చేశాడని అన్నారు. ఎన్నో కలలతో అతను అమెరికా వచ్చి ఉండొచ్చని కునాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని కునాల్ తెలిపారు. వీసా వచ్చిన మరుసటి రోజు ఉదయానికే అమెరికా చేరుకుంటున్న విద్యార్థులు ఎయిర్‌పోర్టు అధికారుల ముందు తడబాటుకు గురై సాయంత్రానికి కల్లా రిటర్న్ విమానంలో భారత్‌కు డిపోర్టు అవుతున్నారని తెలిపారు. వీడియోలోని విద్యార్థి విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో నిరసనలు నేడు కూడా మిన్నంటాయి. వలసలపై ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరిని నిరసిస్తూ ఆదివారం నాడు వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే కాక కార్లకు నిప్పు పెట్టారు. అల్లర్లను అణచివేసేందుకు 2 వేల మంది నేషనల్ గార్డ్స్ దళాలను ట్రంప్ సర్కార్ రంగంలోకి దింపింది.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్టులో షాకింగ్ దృశ్యం.. ఎన్నారై విద్యార్థికి బేడీలు వేసి దారుణంగా..

లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడుయూఎస్

Read Latest NRI News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 09:46 PM