ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US VISA: సోషల్ మీడియాలో లేకపోయినా నో వీసా.. యూఎస్ నిబంధనలతో జనాల్లో టెన్షన్

ABN, Publish Date - Jun 03 , 2025 | 08:00 PM

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని వారి వీసా దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించడం కలకలం రేపుతోంది. తాజా నిబంధనలు భావప్రకటనా స్వేచ్ఛను అతిక్రమించేలా ఉన్నాయని న్యాయ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.

US visa social media policy

ఇంటర్నెట్ డెస్క్: హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇటీవల తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలను వివిధ దేశాల్లోని అమెరికా ఎంబసీలకు పంపించారు. సోషల్ మీడియాలో లేని వారు, తమ అకౌంట్‌లను బయటి వారు చూడకుండా ఆంక్షలు పెట్టేవారి వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అంటే, సోషల్ మీడియాలో లేని దరఖాస్తుదారులను కాన్సులార్ అధికారులు అనుమానాస్పదులుగా, తప్పించుకుని తిరిగే వారిగా భావించే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.


విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్‌లు, గెస్ట్ స్పీకర్లు, టూరిస్టులు.. ఇలా హార్వర్డ్‌ను సందర్శించాలనుకునే వారందరికీ తాజా నిబంధన వర్తిస్తుందని మంత్రి రూబియో తెలిపారు. విదేశీయుల విషయంలో అమెరికా నిబంధనలు మరింత కఠినం చేయనుందనే దానికి సంకేతంగా తాజాగా రూల్స్‌ను భావించాలని పరిశీలకులు చెబుతున్నారు. వీసా ఇంటర్వ్యూలకు సంబంధించి భద్రతా ప్రమాణాల పునఃపరిశీలన కోసం ఉద్దేశించిన పైలట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ నిబంధనలను అమెరికా రూపొందించింది.

ఈ నిబంధనలపై న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానంతో ఎవరికీ ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్ పోస్టు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా లేకపోయినా అభ్యర్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, భావప్రకటనా స్వేచ్ఛ హద్దులను అతిక్రమించేలా తాజా నిబంధనలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.


వీసా పొందేందుకు ప్రస్తుతం దరఖాస్తుదారులు తమ విద్యార్హతలతో పాటు ఆర్థిక స్థితిగతులు, స్వదేశానికి తిరిగెళ్లాలన్న ఉద్దేశ్యాన్ని నిరూపించుకోవాలి. వీటికి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా తోడవడంతో దరఖాస్తుదారులపై మరింత ఒత్తిడి తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డిజిటల్ నిఘా ఎక్కువ ఉన్న దేశాలు, సాంస్కృతిక కారణాలతో గోప్యత పాటించే దేశాల వారిపై తాజా నిబంధనల ప్రతికూల ప్రభావం ఎక్కువని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియాలో దారుణం.. అరెస్టు సమయంలో తీవ్ర గాయాలు.. కోమాలో భారత సంతతి వ్యక్తి

సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు

Read Latest and NRI News

Updated Date - Jun 03 , 2025 | 08:50 PM