Share News

Saudi Mini Mahanadu: సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు

ABN , Publish Date - May 31 , 2025 | 07:13 AM

సౌదీ అరేబియాలో శుక్రవారం మినీ మహానాడును వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో కూడిన తీర్మానాన్ని పార్టీ కార్యకర్తలు ఆమోదించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.

Saudi Mini Mahanadu: సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు
Saudi Mini Mahanadu

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అరేబియా దేశాలలో పని చేస్తున్న పేద, కార్మిక తరగతి ప్రవాసాంధ్రులకు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు దక్కాల్సిన ఆవశ్యకత ఉందని పార్టీ సౌదీ అరేబియా శాఖ నొక్కి చెప్పింది.

ఈ మేరకు సౌదీ అరేబియాలో శుక్రవారం నిర్వహించిన మినీ మహానాడులో నాలుగు అంశాలతో కూడిన తీర్మానాన్ని పార్టీ కార్యకర్తలు ఆమోదించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.

చమురు, అనుబంధ పెట్రో రసాయనాల ఉత్పత్తికి కేంద్రబిందువయిన ఈశాన్య ప్రాంతంలోని జుబేల్‌లో తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా శాఖ ఆధ్వర్యంలో జరిగిన మహానాడులో ప్రవాసాంధ్ర పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జుబేల్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడును సంప్రదాయకంగా జరుపుకుంటున్నారు.

1.jpg


ప్రపంచంలోని ప్రతిమూలా ఉన్న తెలుగు వాడికి చేరువ కావడానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు చేస్తున్న ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ వివరించారు. అనుభవజ్ఞులున్న బృందంతో ఏపీ ఎన్నార్టీ అధ్యక్షుడు వేమూరి రవి చేస్తున్న కృషిని కూడా ఆయన సభికులకు తెలిపారు.

గల్ఫ్ దేశాలలో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాసాంధ్రులకు న్యాయపరమైన సహాయం చేయడానికి ప్రత్యేకంగా న్యాయ సహాయక విభాగాలను నెలకొల్పాలని పార్టీ కోరింది. 100 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌తో సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గానికి ప్రవాసీయుల వివరాల నమోదుకు సంబంధించి ఒక ఇన్చార్జ్‌ని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని, వృత్తిపరమైన నైపుణ్యతను పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్‌కు చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియా తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రతినిధులు ఆమోదించారు.


కార్యక్రమాన్ని భరద్వాస్, చంద్రశేఖర్, శ్రీనివాస రావు, నాగేశ్వర రావు, పోషన్ చౌదరి, భూపతి రెడ్డి, అశోక్, డాక్టర్ శ్రీనివాస్, అలీ, సంపత్ తదితరులు సమన్వయం చేసారు.

ఇవి కూడా చదవండి:

విధివంచితుడయిన తెలుగు ఫుడ్ డెలివరీ బాయ్‌కి అండగా సాటా సెంట్రల్

ఖతర్‌లో టీడీపీ మినీ మహానాడు.. విజయవాడకు అంతర్జాతీయ విమాన సర్వీసు కోసం తీర్మానం

Read Latest and NRI News

Updated Date - May 31 , 2025 | 11:14 AM