ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: రియాధ్‌లో సాటా సెంట్రల్ తెలుగు భాషా దినోత్సవ వేడుకల సన్నాహాలు

ABN, Publish Date - Jun 01 , 2025 | 10:18 PM

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ప్రతి ఏటా తెలుగు ప్రవాసీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవ వేడుక సన్నాహాలు ముమ్మరమయ్యాయి.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ప్రతి ఏటా తెలుగు ప్రవాసీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవ (టి.బి.డి) వేడుక సన్నాహాలు ముమ్మరమయ్యాయి.

ఎడారి నాట ప్రవాసీ కుటుంబాలు ఆతృతగా ఎదురు చూసే ఈ వేడుకలకు, రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా (సెంట్రల్) ముందస్తుగా నిర్వహించే క్రీడా పోటీలలో ప్రత్యేకించి ఔత్సాహిక క్రికెటర్లు, వివిధ ఇండోర్ గేమ్స్‌లో మహిళలు, బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉద్యోగులతో పాటు పాఠశాల విద్యార్ధినీవిద్యార్ధులు, మహిళలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మేరకు శనివారం రియాధ్‌లోని భారతీయ అంతర్జాతీయ పాఠశాల (ఐ.యస్.ఆర్) ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీలలో 400 మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత షిహాబ్ కొత్తుకాడ్, ప్రవాసీ ప్రముఖుడు సంతోష్ శెట్టి, మోబీలన్, భాంగ్లేలు ముఖ్య అతిథులుగా పాల్గొని సాటా సెంట్రల్ సేవలను ప్రశంసించారు.


ప్రవాసీ కుటుంబాలలో క్రీడలు, సాంస్కృతిక రంగాలతో పాటు వృత్తిపరమైన ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తాము ప్రతి ఏటా టీబీడీ వేడుకలకు ముందు ఈ రకమైన పోటీలను నిర్వహించి విజేతలను టీబీడీ రోజయిన సెప్టెంబర్ 26న సత్కరిస్తామని నిర్వాహకులు చెప్పారు.

తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సంస్కృతి, కళా వికాసం కోసం రియాధ్ నగరంలో మూడేళ్ళ క్రితం తాము శ్రీకారం చుట్టిన టీబీడీ వేడుకలు ఒక మైలురాయి అని సాటా సెంట్రల్ ప్రతినిధులు ఆనందరాజు, ముజ్జమ్మీల్, రంజీత్, ఆనంద్ పోకూరి, జానీ బాషా, ఎర్రన్న, సత్తిబాబు, కాకమూని లక్ష్మిలు వెల్లడించారు. సాటా వ్యవస్థాపకులయిన తాము ప్రస్తుతం సాటా సెంట్రల్‌గా రూపాంతరం చెందామని వారన్నారు.


ప్రతి సంవత్సరం సౌదీ జాతీయ దినోత్సవ సెలువుల సందర్భంగా తాము దీన్ని నిర్వహిస్తామని, ఈసారి కూడా సెప్టెంబర్ 26న రియాధ్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వారు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

భారతీయుల ఈమెయిల్స్‌కు రిప్లై ఇవ్వను.. న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య

ఖతర్‌లో టీడీపీ మినీ మహానాడు.. విజయవాడకు అంతర్జాతీయ విమాన సర్వీసు కోసం తీర్మానం

Read Latest and NRI News

Updated Date - Jun 02 , 2025 | 03:17 PM