NRI: మహిళా శరణాలయాల్లో తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు
ABN, Publish Date - Oct 29 , 2025 | 02:00 PM
తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియానా, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లోని మహిళా శరణాలయాల్లో సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని గ్యారీ నగరం, ఇండియానా, ఇల్లినాయిస్ రాష్ట్రాల మహిళా శరణాలయాల్లో తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), లీడ్ ది పాత్ ఫౌండేషన్ సంయుక్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాయి.
ఎన్‌ఆర్‌ఐ విద్యార్థుల సమన్వయకర్త(తానా) డా. ఉమా ఆర్. కటికి (అరమండ్ల) మార్గదర్శకత్వంలో మూడోసారి అక్టోబర్ 10న ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అక్కడి వారికి శానిటరీ ప్రాడక్ట్స్, ఆహారపదార్థాలతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించారు.
ఈ సందర్భంగా తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తమ సేవా కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు, దాతలకు, తానా, లీడ్ ది పాత్ ఫౌండేషన్ నాయకత్వానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
గృహహింస, నిరాధార పరిస్థితులు, లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అనేక మంది ఈ మహిళలకు శరణాలయాల్లో తాత్కాలిక ఆశ్రయం దక్కుతోంది. బాధితులకు భద్రత కల్పించి, పునరావాసానికి అవసరమైన సహాయాన్ని శరణాలయాల నిర్వాహకులు అందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టిలో భాగస్వామ్యం అందిస్తాం: గల్ఫ్ తెలుగు వైశ్యవ్యాపారవర్గాలు
ఏపీ లో పెట్టుబడులు పెట్టండి.. ఎన్ఆర్ఐలకు మన్నవ పిలుపు..
Updated Date - Oct 29 , 2025 | 10:47 PM