ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TANA 5k Run: విజయవంతమైన న్యూ ఇంగ్లాండ్ తానా, గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్

ABN, Publish Date - Sep 29 , 2025 | 04:35 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, బోస్టన్‌లోని గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాన్స్ఫీల్డ్ టౌన్‌లో 5కే వాక్‌‌ను విజయవంతంగా జరిగింది. గ్లోబల్‌ గ్రేస్‌ హెల్త్‌‌తో కలిసి తానా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ వాక్‌ను నిర్వహించారు.

TANA 5K Walk Boston

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బోస్టన్‌లోని గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో మాన్స్ఫీల్డ్ టౌన్‌లో 5కే వాక్‌‌ను విజయవంతంగా నిర్వహించింది. గ్లోబల్‌ గ్రేస్‌ హెల్త్‌‌తో కలిసి తానా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ వాక్‌ను నిర్వహించారు.

ఈవెంట్ కోసం రన్నింగ్ పార్క్ దగ్గర రన్నర్లు, వాకర్లు సమావేశమయ్యారు. రెండు సంస్థలు అందించిన ప్రత్యేకంగా టీ-షర్టులు, క్యాప్‌లను ధరించి ఉత్సాహంగా కనిపించారు. ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. ఫిట్‌నెస్ ఔత్సాహికులు, కుటుంబాలను ఒకచోట చేర్చింది. నడక తర్వాత, అల్పాహారం అందించారు. ఆ తరువాత తానా ప్రతినిధులు సమాజానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అవగాహనపై రూపొందించిన కార్యక్రమాలను హైలైట్ చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన వారిని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు.

తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానుకొండ, న్యూజెర్సీ నుంచి తటస్థముగా విచ్చేసిన తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక, మంచి కార్యక్రమాల నిర్వహణలో అందరూ భాగస్వాములవ్వాలన్న తలంపుతో ఇలాంటి కార్యక్రమాలను తానా ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు. తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి తన సందేశంలో ఫౌండేషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని చెప్పారు. సేవే ప్రధానముగా తానా చేస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ స్వచ్ఛంద సేవకుల స్పందనను ప్రశంసించారు. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను రాబోయే తరానికి స్ఫూర్తిని ఇవ్వటంలో దోహదపడతాయని అన్నారు

తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గోండి మాట్లాడుతూ.. అన్ని సేవా కార్యక్రమాల్లో ఐకమత్యంగా అందరు పాల్గొనాలి అని సూచించారు. మురళీ పసుమర్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంకినీడు ప్రసాద్, సూర్య తేలప్రోలు, రమేష్ బాబు తల్లం, అనిల్ పొట్లూరి, చాంద్ పాషా, రామకృష్ణ కొల్లా, సురేష్ దగ్గుబాటి, మహిళా రన్నర్లు, వాలంటీర్‌లు, వారి కుటుంబాలతో పాటు పాల్గొన్నారు. కార్యక్రమానికి చివరిగా తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ వందన సమర్పణ చేశారు.

ఇవి కూడా చదవండి..

సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో చండీ హోమం

ఘనంగా ముగిసిన శంకర నేత్రాలయ 5కే వాక్

Read Latest NRI News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 04:36 PM