ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TANA: తానా మహాసభలకు వస్తున్న తారలు

ABN, Publish Date - Jun 09 , 2025 | 09:54 AM

తానా మహాసభలకు తారలు తరలివస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు ఈ సభలకు హాజరవనున్నారు.

TANA 2025 conference

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈసారి తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో జరగనున్నాయి. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితో పాటు అమెరికాలోని రాజకీయ ప్రముఖులు, ఇండియాలో ఉన్న రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు, ఇతరులు మహాసభలకు వచ్చి కనువిందు చేస్తుంటారు. ఈసారి మహాసభలకు సినీరంగం నుంచి పలువురు హీరోలు, హీరోయిన్‌లు, సంగీత దర్శకులు, నేపథ్యగాయనీ గాయకులు వస్తున్నారు. వీరితోపాటు యాంకర్లు ఇతర చిన్న, పెద్ద తారలంతా తరలి వస్తున్నారు.

టాలీవుడ్‌లో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్‌తో పాటు హీరో నిఖిల్, యాంకర్ సుమ, దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, ప్రముఖ సంగీత దర్శకులు థమన్, గాయనీ గాయకులు చిత్ర, సునీత, ఎస్.పి.బి. చరణ్, శ్రీకృష్ణ, సింహతోపాటు గాయని శోభారాజు, జబర్దస్త్ హీరోయిన్ సత్యశ్రీ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు. వీరితోపాటు ఇతర ప్రముఖులు కూడా వచ్చే ఈ మహాసభలకు అందరూ రావాలని కాన్ఫరెన్స్ నిర్వాహకులు కోరారు.

రిజిస్ట్రేషన్ ఆఫర్

జూన్ 8వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక టిక్కెట్‌కు ఇంకో టిక్కెట్ ఫ్రీగా ఇస్తున్నట్లు తానా మహాసభల కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్ చాపలమడుగు తెలిపారు. ఈ ఆఫర్ కావాలనుకున్నవారు పోస్టర్‌లో చూపిన విధంగా కోడ్‌ను ఉపయోగించుకుని పొందవచ్చు. జూలై 4, 5వ తేదీ వరకు సాధారణ రిజిస్ట్రేషన్ లు జరుగుతుంటాయి. బోగో ఆఫర్ మాత్రం జూన్ 8వరకు మాత్రమే ఉంది. వెంటనే మహాసభలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇతర వివరాలకు కాన్ఫరెన్స్ వెబ్ సైట్‌ను చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు

సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు

Read Latest and NRI News

Updated Date - Jun 09 , 2025 | 11:33 AM