Super Star Krishna Birthday: బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:26 PM
కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టాలీవుడ్ లెజెండరీ నటుడు, సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ 82వ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన హీరో ఘట్టమనేని శివరామకృష్ణ జయంతిని ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.
శ్రీకాంత్ దొడ్డపనేని, నారాయణ రావు రావవరపు, శశి దొప్పలపుడి, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి, వెంకయ్య సీ జెట్టి, వెంకట్ కొల్లా, భాస్కర్ వల్లభనేని, సుధీర్ ఉన్నం, శ్రీకర్ రెడ్డి, ఆది నారాయణ రావు సూరెడ్డి, భాను, రాజేష్ నల్లూరి, కరీమ్, శ్రీనివాస్ వీరమాచినేని, రవి కిరణ్, హరి సన్నిధి, కృష్ణ మట్పర్తి, శ్రీధర్ మన్నె, సందీప్ తైరెడ్డి, శ్రీకాంత్ కూర్మన, శ్రవణ్ డోకె తదితరులు తమ అభిమాన హీరో మెగా ఓల్డ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విధివంచితుడయిన తెలుగు ఫుడ్ డెలివరీ బాయ్‌కి అండగా సాటా సెంట్రల్
ఖతర్‌లో టీడీపీ మినీ మహానాడు.. విజయవాడకు అంతర్జాతీయ విమాన సర్వీసు కోసం తీర్మానం
Updated Date - Jun 02 , 2025 | 05:26 PM