NRI: ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకు యూఎస్ఏలో సత్కారం
ABN, Publish Date - Aug 08 , 2025 | 11:00 PM
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావును ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు సత్కరించారు. అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో భాను మాగులూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో భాను మాగులూరి ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావును ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు సత్కరించారు. ఈ సందర్భంగా గోనుగుంట్ల కోటేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, చల్లా జక్కి రెడ్డి, భాను మాగులూరి మాట్లాడుతూ.. మానవత్వంతో తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు దేశంలో ఎక్కడా లేని విధంగా, పెన్షన్‌లు పంపిణి చేస్తున్నదని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు.
దివ్యాంగులకు పార్టీలో ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు, పది వేలు, పదిహేను వేలు చొప్పున ఇచ్చి ఆదుకుంటున్నారని చెప్పారు. భగవంతుడు ఇచ్చిన శక్తిని, యుక్తిని, సంపదను, అధికారాన్ని సమాజ హితానికి ఖర్చుపెట్టాలని అన్నారు. మంచి పుస్తకం మంచి నేస్తంతో సమానమని, అన్ని రకాల ఆధునిక ప్రసార మాధ్యమాల కన్నా పుస్తకం గొప్పదనేది అందరం గ్రహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో చామర్తి శ్రావ్య, బోనాల రామకృష్ణ, దొప్పలపూడి అరుణ్ కుమార్, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు, నంబూరి చంద్రనాథ్, చల్లా సుబ్బారావు, వనమా లక్షినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు
శాన్ జోస్‌లో ఐసీఏసీ ప్రారంభం...ఇంటి వద్దకే కాన్సులేట్ సేవలు!
Updated Date - Aug 09 , 2025 | 06:43 AM