Share News

Chandrababu: పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు

ABN , Publish Date - Aug 08 , 2025 | 07:26 AM

ఏపీ ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమానికి ఎన్నారైలు చేయూత నివ్వాలని, ఆట్టడుగు వర్గాలకు సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Chandrababu: పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు
P4 program Andhra Pradesh

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు అట్టడుగునున్న కుటుంబాలు, వ్యక్తులు. గ్రామాల అభివృద్ధికై తోడ్పడాలనే ఆశయంతో తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పీ-4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

ఈ పథకంపై గురువారం విజయవాడలో ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తలు, ప్రవాసీయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విదేశాలలోని ప్రవాసాంధ్రులు మాతృభూమి రుణాన్ని తిరిగి చెల్లించడానికి పీ-4 పథకం సబబైనదని అన్నారు. సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు ఈ దిశగా ఆసక్తిగా ముందుకు రావడం ముదావహమని ముఖ్యమంత్రి అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పది బంగారు కుటుంబాలను తాను దత్తతకు తీసుకుంటున్నట్లుగా తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతిస్తూ అభినందించారు.

3.jpg


ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సౌదీ అరేబియా ఎన్నారై తెలుగుదేశం పార్టీ, ప్రముఖ ప్రవాసీ తెలుగు సంఘమైన సాటా సెంట్రల్ ప్రతినిధి బృందాలు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాధాకృష్ణా నాయకత్వంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ పక్షాన రియాధ్ నగరంలోని తమ సభ్యులు కొన్ని బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా ఉంటామని ముందుకు రాగా, సామాజిక సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కదిలే సాటా సెంట్రల్ తామూ చేయూత ఇస్తామని ముందుకొచ్చింది.

1.jpg

సౌదీ అరేబియా నుండి సమావేశంలో ప్రాతినిధ్యం వహించిన ఈ రెండు బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాటా సెంట్రల్ మహిళ విభాగం అధ్యక్షురాలు సుచరిత పీ4 విధానం గురించి ప్రవాసీయులలో విస్తృత ప్రచారం చేసి అవగాహన తీసుకురావల్సిన ఆవశ్యకత గురించి చేసిన సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడమే కాకుండా అమె పేరును ప్రస్తావిస్తూ అవగాహన ఆవశ్యకతను ప్రశంసించారు.

1.jpg


రియాధ్ నుండి విజయవాడకు వచ్చిన వారిలో ఆనంద్ పోకూరి, సత్తిబాబు, ప్రొఫెసర్ రబ్బానీ, నరేశ్, అక్షిత, గడ్డం శిల్ప, చేతన, సుచరిత, మానస, మాధవి, ముబీనాలు ఉన్నారు. వీరిలో అనేక మందితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖీగా మాట్లాడారు.

సౌదీ అరేబియా నుండి వచ్చిన ప్రవాసీ ప్రతినిధులు ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు డాక్టర్ వేమూరి రవికుమార్, పార్టీ నాయకులు రాజశేఖర్, బుచ్చిరాం ప్రసాద్‌లను కూడా కలిశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

శాన్ జోస్‌లో ఐసీఏసీ ప్రారంభం...ఇంటి వద్దకే కాన్సులేట్ సేవలు!

కాన్సుల్ జనరల్ బాధ్యతలు చేపట్టనున్న యూఎస్ అధికారి లారా విలియమ్స్‌ గౌరవార్థం ప్రత్యేక విందు

Read Latest and NRI News

Updated Date - Aug 08 , 2025 | 04:23 PM