NATS: నాట్స్ సంబరాల్లో గోవింద నామస్మరణ. రెండో రోజు వేడుక ప్రారంభం
ABN, Publish Date - Jul 05 , 2025 | 09:36 PM
నాట్స్ తెలుగు సంబరాల్లో భాగంగా రెండవ రోజు కార్యక్రమం వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంతో ప్రారంభమైంది. ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించారు.
ఇంటర్నెట్ డెస్క్: టాంపాలో జరుగుతున్న నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో రెండో రోజు కార్యక్రమం దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణంతో ప్రారంభమైంది. ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, వసుంధర దంపతులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. రెండో రోజు స్థానిక ప్రవాసుల ప్రదర్శనలు, స్టాళ్లు, వినోదభరిత కార్యక్రమాలు, సాహితీ చర్చలు, ప్రవాసుల సమ్మేళనాలను ఏర్పాటు చేశారు.
తనికెళ్ల భరణి సహకారంతో ప్రచురించిన హంస వింశతి పుస్తకాన్ని ఆవిష్కరించి బాలకృష్ణ ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతకు మూలం పురతాన విజ్ఞానమని కొనియాడారు. పిల్లలు పుస్తకాల సారం గ్రహించేలా ప్రోత్సహించాలని కోరారు. పారుపల్లి రంగనాథ కచేరీ అలరించింది.
నాట్స్ సంబరాల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, కార్యదర్శి మల్లాది శ్రీనివాస్, మిక్కిలినేని సుధీర్, నందమూరి రామకృష్ణ, పితాని సత్యనారాయణ, మన్నవ మోహనకృష్ణ, మురళీ మేడిచర్ల, ఆలపాటి రవి, సుధీర్ అట్లూరి, హరనాథ్ బుంగతావుల, గోపీచంద్ మలినేని, డా. మధు కొర్రపాటి, మంచికలపూడి శ్రీనివాసబాబు, పాతూరి నాగభూషణం, కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం
ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
Updated Date - Jul 06 , 2025 | 07:15 AM