ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heathrow Deportee: డిపోర్టు చేస్తుండగా తప్పించుకున్న భారతీయుడు.. టార్మాక్‌పై పరుగు

ABN, Publish Date - Jun 10 , 2025 | 07:55 PM

లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి డిపోర్టు అవుతున్న ఓ భారతీయుడు భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకుని ఎయిర్‌పోర్టు టార్మాక్‌పై పరుగెత్తిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

Heathrow deportee escape

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో ఓ భారతీయుడు అధికారుల నుంచి తప్పించుకుని టార్మాక్ మీదుగా పరిగెత్తిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, సదరు భారతీయుడు ఓ కమర్షియల్ విమానంలో భారత్‌కు తిరిగిరావాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. తన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి అతడు తప్పించుకుని టార్మాక్ మీద పరిగెత్తాడు. ఓ వ్యక్తి ఈ దృశ్యాల్ని రికార్డు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

అతడిని వెంబడించిన ఎయిర్‌‌‌పోర్టు సిబ్బంది కొన్ని నిమిషాల తరువాత అదుపులోకి తీసుకున్నారు. 2వ టర్మినల్ వద్ద ఈ ఘటన జరిగింది.

యూకే వలసల శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఈ విషయంపై స్పందించారు. ఘటనపై విచారణ ప్రారంభమైనట్టు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని విమానమెక్కించి స్వదేశానికి పంపించినట్టు తెలిపారు.

కాగా, వీడియో రికార్డు చేసిన వ్యక్తి ఈ సీన్ చూసి షాకయిపోయారు. అసలేం జరుగుతోంది. అందరూ టార్మాక్‌పై ఎందుకు పరిగెడుతున్నారని అన్నాడు. ఆ భారతీయుడిని ఓ వ్యాన్‌ వెంబడించిన దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. అతడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పోలీసులు వచ్చి అతడిని తమ వెంట తీసుకెళ్లారు. అతడిని నేలపైకి తోసి కదలకుండా చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన వల్ల విమానసర్వీసుల్లో ఎలాంటి జాప్యం జరగలేదని ఎయిర్‌పోర్టు ప్రతినిధి తెలిపారు.

విమానయాన భద్రతా వ్యవహారాల నిపుణులు మాత్రం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘విమానం నుంచి వచ్చే జెట్ బ్లాస్ట్ తగిలితేనే మనుషులకు తీవ్ర గాయాలవుతాయి. విమానం ల్యాండ్ చేస్తున్న క్రమంలో పైలట్‌లు ఇలాంటి వ్యక్తులను చూస్తే పరిస్థితి అనూహ్య మలుపు తిరుగుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్టులో షాకింగ్ దృశ్యం.. ఎన్నారై విద్యార్థికి బేడీలు వేసి దారుణంగా..

ఎయిర్‌పోర్టులో భారతీయ విద్యార్థికి బేడీలు.. మరో వార్నింగ్ ఇచ్చిన అమెరికా

Read Latest NRI News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 08:02 PM