ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dubai: గల్ఫ్‌లో గణనాథుల ఆరాధన.. కార్యక్రమాలను ముందుండి నడిపించిన గోదావరి జిల్లాల ఎన్నారైలు

ABN, Publish Date - Sep 08 , 2025 | 07:54 PM

గల్ఫ్‌లో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలను గోదావరి జిల్లాల ప్రవాసీయులు ముందుండి నడిపించారు.

Ganesh immersion Dubai

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృదేశంలోని వేడుకల తరహాలో ఆర్భాటంగా కాకున్నా ఆద్యంతం ఆధ్యాత్మికంగా గణనాథుడిని ఆరాధించిన గల్ఫ్ అరేబియా దేశాల ప్రవాసీయులు వినాయక నిమజ్జనంతో వీడ్కోలు పలికారు. దుబాయితో సహా యావత్ గల్ఫ్ దేశాలలో గణపతి బప్పా మోరియా అంటూ గణనాథుని పూజలో ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసీయులు సత్తా చాటారు.

దుబాయ్‌లో రోజుకు సగటున 5 వేల మంది భక్తులు దర్శించుకున్న సోనాపూర్‌‌లోని ఏకదంతుని విగ్రహ ప్రతిష్ఠాపన, నిమజ్జన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రవాసీయులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒక ప్రముఖ భారీ యంత్రాల సంస్థ.. ఆ ఆవరణలో కార్మికుల క్యాంప్ ఏర్పాటు చేసింది. నిమజ్జనానికి ముందు చేసిన భోజన ఏర్పాట్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన మొత్తం పది వేల మంది పాల్గొన్నట్లుగా ముఖ్య నిర్వాహకుడయిన తాడేపల్లిగూడెం మండలం దర్శిపురానికి చెందిన పంతం సుబ్బరాజు వెల్లడించారు.

దుబాయిలో మినీ భారత్‌గా పేరొందిన సోనాపూర్‌లో గత దశాబ్ద కాలంగా సుబ్బరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన క్యాంప్ బాస్ అబ్దుల్ నాసర్, అరబ్బుల సహాయంతో తమ జిల్లా వాసులంతా కలిసి దశాబ్ద కాలం క్రితం వినాయక చవితికి శ్రీకారం చుట్టామని ఆయన వెల్లడించారు. ఇదే సంస్థలో పని చేస్తున్న ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రాంబాబు, నాగబాబు, ఫణీంద్ర, రాజమండ్రి శ్రీను, కె.వి.రెడ్డి, వెంకటరెడ్డిలు ఇందులో కీలక పాత్ర వహిస్తున్నారు.

ఇదే సంస్థలో పని చేసే రామారావు ఏకంగా 8 వేల మందికి అవసరమైన భోజనాన్ని వండగా, కొండ బాబు, రామారావులు పూజారులుగా వ్యవహరించారు. పాలకొల్లుకు చెందిన ప్రస్తుత క్యాంప్ బాస్ శివ, కరీంనగర్ జిల్లాకు చెందిన వినోద్ నేతృత్వంలోని భజన మండలి తమ కార్యక్రమాలతో భక్తులను అలరింపజేసిందని సుబ్బరాజు వెల్లడించారు. మహిళా భక్తులు వస్తుండడంతో వారందరికీ పసుపు కుంకుమ, జాకెట్లను కూడా బహూకరించడం ద్వారా ఆడపడుచులను గౌరవించామని కూడా ఆయన చెప్పారు. తమ జిల్లా ప్రవాసీ, క్రైస్తవుడయిన ఏసు, హైదరాబాద్ నగరానికి చెందిన ముస్లిం అబ్దుల్ నాసర్‌ల సహాయం కూడా ముఖ్యమని సుబ్బరాజు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

న్యూజెర్సీలో తానా బ్యాక్ ప్యాక్ వితరణ

భారతీయులకు మద్దతుగా అమెరికన్.. వాళ్లను పంపించేస్తే అమెరికాకే నష్టం అంటూ పోస్టు

Read Latest and NRI News

Updated Date - Sep 08 , 2025 | 08:04 PM