TANA: న్యూజెర్సీలో తానా బ్యాక్ ప్యాక్ వితరణ
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:43 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. తానా ఆధ్వర్యంలో ఫ్రీహొల్డ్ బరొ స్కూల్‌లో సుమారు 200 మంది విద్యార్థులకు సంస్థ ప్రతినిధులు బ్యాక్ ప్యాక్‌లను పంపిణీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ టీం ఆధ్వర్యంలో ఫ్రీహొల్డ్ బరొ స్కూల్‌లో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపు 200 మంది స్కూల్ విధ్యార్థులకు స్థానిక స్కూల్ అధికారులు, పోలిస్ అధికారులు, తానా ప్రతినిధుల చేతులమీదగా బాక్ ప్యాక్‌లు, ఇతర స్కూల్ సామగ్రిని అందించారు (TANA).
అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరెన్ కొడాలి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో తానా ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తానా ప్రతినిధుల తెలియజేసారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచిన తానా కోశాధికారి రాజా కసుకుర్తికి తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నారెపలుపు, స్కూల్ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తానా కోశాధికారి రాజా కసుకుర్తి, తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నారెపలుపు, తానా యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, తానా ఫౌండేషన్ ట్రస్టీలు శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేక, తానా సేవకులు సుధీర్ రామపురం, ఉమా రవి, కిరణ్ భాసన, వెంకట్ పుసులూరి, రామకృష్ణ చెరుకూరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫ్రీహొల్డ్ బరొ స్కూల్ స్కూల్ నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా బ్యాక్ ప్యాక్ కింద తమ స్కూల్‌ను ఎంపిక చేసుకుని పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేసినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల తల్లితండ్రులు కూడా తానాకు తమ అభినందనలు తెలియజేశారు.






ఈ వార్తలు కూడా చదవండి:
మొత్తం 207 దేశాల్లో భారత సంతతి ప్రజలు.. కేంద్ర గణాంకాల్లో వెల్లడి
భారతీయులకు మద్దతుగా అమెరికన్.. వాళ్లను పంపించేస్తే అమెరికాకే నష్టం అంటూ పోస్టు