ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెంట్రుకలు రాలుతున్నాయా

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:44 AM

వెంట్రుకలు ఊడుతున్నాయనే ఆందోళన ఎంతో కొంత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఎన్ని వెంట్రుకలు ఊడితే సమస్యగా పరిగణించాలి? ఆ సమస్యను ఎలా చక్కదిద్దుకోవాలి? తెలుసుకుందాం!...

హెయిర్‌ ఫాల్‌

వెంట్రుకలు ఊడుతున్నాయనే ఆందోళన ఎంతో కొంత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఎన్ని వెంట్రుకలు ఊడితే సమస్యగా పరిగణించాలి? ఆ సమస్యను ఎలా చక్కదిద్దుకోవాలి? తెలుసుకుందాం!

వెంట్రుకలు ఊడడం, పెరగడం సహజం. అయుతే కొన్ని సందర్భాల్లో ఊడిపోవడమే తప్ప, తిరిగి పెరిగే పరిస్థితి ఉండదు. అయితే వెంట్రుకలు అడపాదడపా రాలుతూనే ఉంటాయి కాబట్టి దాన్ని సమస్యగా పరిగణించాలో, లేదో తెలియక అయోమయానికి గురవుతూ ఉంటాం. నిజానికి దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు రాలిపోయే 10 నుంచి 15 వెంట్రుకలను చూసుకుని కంగారు పడిపోకూడదు. తలలో ఒకే చోట వెంట్రుకలు కుచ్చులా ఊడిపోవడం, ప్యాచ్‌లాగా ఏర్పడడం, మొటిమలు లాంటివి తలెత్తినా,రోజుకు వందకు మించి వెంట్రుకలు రాలిపోతున్నా వెంటనే అప్రమత్తం కావాలి. అయితే కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా వెంట్రుకలు రాలతాయి. ఎప్పుడంటే...

వైరల్‌ జ్వరాలు: ఈ జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత కూడా వెంట్రుకలు రాలతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనపడవలసిన అవసరం లేదు. మాంసకృత్తులతో కూడిన పోషకాహారం తీసుకోగలిగితే ఈ పరిస్థితి నెమ్మదిగా సర్దుకుంటుంది

ప్రసవానంతరం: ప్రసవం తర్వాత కూడా వెంట్రుకలు రాలతాయి. ఇది సహజం. అయితే సప్లిమెంట్లతో, పౌష్ఠికాహారంతో ఈపరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు

థైరాయిడ్‌: వెంట్రుకలు రాలడంతో పాటు అకారణంగా బరువు తగ్గినా, పెరిగినా థైరాయిడ్‌ సమస్యగా అనుమానించి వైద్యులను కలవాలి

పిల్లల్లో: సాధారణంగా పిల్లల్లో పోషకాహార లోపాల వల్ల వెంట్రుకలు రాలతాయి. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉండే నట్స్‌, పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం ఇవ్వాలి

సౌందర్య చికిత్సలు: స్ట్రెయిటెనింగ్‌ లాంటి చికిత్సలతో వెంట్రుకలు రాలతాయి. అలర్జీలు కలిగి ఉండి హెయిర్‌ డై వేసుకున్నప్పుడు వెంట్రుకలు రాలతాయు

పిసిఔస్‌: పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ ఉన్న మహిళల్లో వెంట్రుకలు రాలే సమస్య తీవ్రంగా ఉంటుంది

వైద్యులను ఎప్పుడు కలవాలి?

  • రోజుకు వంద కంటే ఎక్కువ వెంట్రుకలు రాలుతున్నప్పుడు

  • నుదుటి దగ్గరి వెంట్రుకలు వెనక్కి వెళ్లిపోతున్నప్పుడు

  • మహిళల్లో పాపిట వెడల్పుగా మారిపోయినప్పుడు

  • వెంట్రుకలు పలుచబడి మాడు కనిపిస్తున్నప్పుడు

  • తలలో ఒకే చోట పేను కొరుకుడు తలెత్తినప్పుడు

  • దురద, మొటిమలు ఉన్నప్పుడు

ఈ పరీక్షలు తప్పనిసరి

డెర్మోస్కోపిక్‌ ఎగ్జామినేషన్‌, రక్త పరీక్షలతో వెంట్రుకలు రాలే సమస్య తీవ్రతను వైద్యులు అంచనా వేయగలుగుతారు. డెర్మోస్కోపిక్‌ పరీక్షతో వెంట్రుకల కుదుళ్లు, వాటిలో నాటుకున్న వెంట్రుకల పరిస్థితి, రాలే వెంట్రుకల తీవ్రత, చుండ్రు, సెబోరిక్‌ డెర్మటైటిస్‌ లాంటి ఇన్‌ఫెక్షన్లను వైద్యులు తెలుసుకోగలుగుతారు. రక్తపరీక్షతో విటమిన్‌ డి, ఐరన్‌, బి12 లోపాలతో పాటు థైరాయిడ్‌, అనీమియా, ఇతరత్రా అంతర్గత ఆరోగ్య సమస్యలను కూడా కనిపెట్టగలుగుతారు.

ఆధునిక చికిత్సలొచ్చాయి

మునుపు బట్టతల కోసం మోనాక్సిడిల్‌ అనే పైపూత మందు వినియోగంలో ఉండేది. ఇప్పుడు బట్టతలను అడ్డుకునే డిహెచ్‌టి ఇన్హిబిటర్‌ లోషన్లు కూడా అందుబాటులోకొచ్చాయి. అలాగే కాంబినేషన్‌తో కూడిన క్రీములు, లోషన్లు కూడా అందుబాటులోకొచ్చాయి. మునుపు మోనాక్సిడిల్‌తో దురద, మంట సమస్య ఉండేది. కానీ ఇప్పుడు ఇది మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో దొరుకుతోంది. మూల కణాల నుంచి విడుదలయ్యే ఎక్సోజోమ్స్‌ వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించి, వెంట్రుకల పెరుదలకు తోడ్పడతాయి. ప్రస్తుతం జంతువులు, సముద్ర జీవుల నుంచి సేకరించిన ఎక్సోజోమ్స్‌ను వెంట్రుకల పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. అలాగే మునుసటి పిఆర్‌పి చికిత్సకు బదులుగా ఇప్పుడు గ్రోత్‌ ఫ్యాక్టర్‌ కాన్‌సెంట్రేట్‌ పిఆర్‌పి అనే సమర్థమైన, ఆధునిక చికిత్స అందుబాటులోకొచ్చింది. అలాగే మునుపు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం వెంట్రుకలను పొట్టిగా కత్తిరించి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పొడవాటి వెంట్రుకలను కూడా ట్రాన్స్‌ప్లాంట్‌ చేయగలుగుతున్నారు.

వెంట్రుకలు రాలకుండా...

  • కంటినిండా నిద్రపోవాలి. నిద్రవేళలు క్రమం తప్పకుండా చూసుకోవాలి

  • పోషకాహారం తీసుకోవాలి

  • శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి

  • హార్మోన్‌ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి

  • శిరోజాల సౌందర్య చికిత్సలకు దూరంగా ఉండాలి

  • శిరోజాల శుభ్రత పాటించాలి

వాటి వాడకం వ్యర్థం

కొందరు జుట్టు రాలే సమస్యను అరికట్టడం కోసం తరచూ షాంపూలు, నూనెలను మార్చేస్తూ ఉంటారు. నిజానికి జుట్టు పెరగడానికీ, రాలకుండా ఉండడానికీ షాంపూలు, నూనెలు ఏ విధంగానూ ఉపయోగపడవు. చుండ్రు, తలలో మొటిమలు లాంటి సమస్యలకు మాత్రమే కొన్ని షాంపూలు ఫలితాన్నివ్వగలుగుతాయి.

డాక్టర్‌ స్వప్న ప్రియ

కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌,

కాస్మోస్యూర్‌ క్లినిక్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 12:44 AM