ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

María Corina Machado: శాంతి బహుమతి

ABN, Publish Date - Oct 11 , 2025 | 06:05 AM

కొందరు నియంతృత్వానికి లొంగుతారు. మరి కొందరు ఎదురుతిరుగుతారు. ఆంక్షలు పెరుగుతున్న కొలది వారి పోరాటం మరింత బలపడుతుంది. అలాంటి వ్యక్తే మరియా కొరీనా మచాడో. వెనెజువెలాలో...

అజ్ఞాతవాసికి

కొందరు నియంతృత్వానికి లొంగుతారు. మరి కొందరు ఎదురుతిరుగుతారు. ఆంక్షలు పెరుగుతున్న కొలది వారి పోరాటం మరింత బలపడుతుంది. అలాంటి వ్యక్తే మరియా కొరీనా మచాడో. వెనెజువెలాలో ప్రజాస్వామ హక్కుల కోసం పోరాడుతున్న యోధురాలు. వెనెజువెల నాయకుడు నికలోస్‌ మాడ్యూరో నియంతృత్వానికి వ్యతిరేకంగాఆమె చేస్తున్న పోరాటానికి బహుమానంగా నోబెల్‌ శాంతి బహుమతి ఆమెను వరించింది.

58 ఏళ్ల మచాడో గత 15 నెలలుగా ఎక్కడ ఉందో.. ఏ ప్రాంతంలో తలదాచుకుంటుందో ఎవరికీ తెలియదు. ఆమె ప్రజలను నేరుగా కలిసింది కూడా లేదు. కానీ ఆమె వెనెజువెలలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల దగ్గర నుంచి మద్దతు లభిస్తోంది. వృత్తిపరంగా ఇండస్ట్రీయల్‌ ఇంజనీర్‌ అయిన మచాడోపై ప్రభుత్వం అనేక రకాలుగా ఒత్తిడి పెట్టింది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె భర్త, ఇద్దరు పిల్లలు, తల్లి అందరూ విదేశాలలో తలదాచుకోవాల్సి వచ్చింది. కానీ మచాడో మాత్రం వెనెజువెలలోనే ఉన్నానంటారు. తన కుటుంబానికి ప్రభుత్వం హాని చేస్తుందనే ఆలోచన మచాడోను ముందు నుంచి వేధిస్తూనే వచ్చింది. ‘‘2012లో నేను ఒక ఎంపీని. నేషనల్‌ అసెంబ్లీలో అప్పటి నియంత హ్యూగో చెవిజ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. హఠాత్తుగా ‘మా అమ్మాయి అన్నా ఎక్కుడుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే నాలో భయం మొదలయింది. మాట్లాడటం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయా. అన్నాతో- ‘నువ్వు ఇక్కడ ఉండద్దు. వేరే దేశానికి వెళ్లిపో!’ అని చెప్పా. ప్రజా పోరాటాలలో ఉండాలంటే మంచి అమ్మగా నా బాధ్యతలు నిర్వర్తించలేనని ఆ రోజే గుర్తించాను’’ అంటారు మాచాడో.

అందమైన బాల్యం

మాచాడో తల్లి మానసిక వైద్యురాలు. తండ్రి ఒక పెద్ద వాణిజ్యవేత్త. ‘‘నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయన బిజినె్‌సలు చూసుకోవటానికి కొడుకులే అక్కర లేదు అని నిరూపించాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అందుకే నేను ఇండస్ట్రీయల్‌ ఇంజినీరింగ్‌ చదివాను’’ అంటారు మాచాడో. చిన్నప్పుడు ఎప్పుడూ రాజకీయాలలోకి రావాలని ఆమె అనుకోలేదు. ‘‘బాగా బిజినెస్‌ చేసి.. ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకొనేదాన్ని’’ అంటారామే! కాలేజీలో చదువుతున్న సమయంలో సమాజంలో ఉన్న అసమానతలను ఆమె ప్రత్యక్షంగా చూశారు. ‘‘నేను ఒక మురికివాడలో పిల్లలకు పాఠాలు చెప్పటానికి వెళ్లేదాన్ని. వాళ్లను చూసిన తర్వాత నాకు గిల్టీ కలిగింది. వాళ్ల గురించి నేను ఏమి చేయటం లేదనే ఆలోచన కలచివేయటం మొదలెట్టింది’’ అంటారు మాచాడో. చదువు పూర్తయిపోయిన తర్వాత తండ్రి స్టీలు ఫ్యాక్టరీలో చేరారు. అయితే అక్కడ ఆమెకు వెనెజువెలాలో ఉన్న రాజకీయ అస్థిరత గురించి తెలిసింది. ‘‘రాజకీయాల గురించి.. రాజకీయనాయకుల గురించి ఫిర్యాదులు చేయటం కాదు. రాజకీయాల్లో చేరి వాటిని ఎలా మార్చాలో ఆలోచించాలి’’ అనే ఉద్దేశంతో సుమేట్‌ అనే ఒక సంస్థను ప్రారంభించారు. 2010లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు.

తొలి అడుగులు

ఆ సమయంలో మచాడో ఎవరికీ తెలియదు. ఆమె గెలుస్తుందని కూడా ఎవరూ అనుకోలేదు. ‘‘లాటిన్‌ అమెరికా దేశాల్లో పితృస్వామ్య వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. నువ్వు అమ్మాయివి.. నువ్వు ఇంజినీర్‌వి.. నీకు డబ్బులు ఉన్నాయి.. నువ్వు ఎన్నికల్లో ఎలా గెలుస్తావు?’’ అని చాలా మంది ఆమెపై విమర్శల వర్షం కురిపించేవారు. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆమె భారీ మెజారిటీతో గెలిచారు. చెవెజ్‌కు వ్యతిరేకంగా ఆమె చేసిన ఉపన్యాసాలు ప్రజలందరినీ ఆకట్టుకొనేవి. 2013లో చెవెజ్‌ మరణించిన తర్వాత మెడ్యూరో అధికారంలోకి వచ్చారు. ఆయన పాలనలో ప్రజలపై ఆంక్షలు మరింత పెరిగాయి. తన రాజకీయ ప్రత్యర్థులను మెడ్యూరో విపరీతంగా వేధించటం మొదలుపెట్టాడు. ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మాచాడోను అణిచివేయటానికి ప్రయత్నం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది (2024) జూలైలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించటానికి మెడ్యూరో నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మాచాడో ప్రయత్నించారు. కానీ కోర్టుల ద్వారా ప్రభుత్వం ఆమె అభ్యర్థిత్వాన్ని అడ్డుకుంది. దీనితో గోన్‌జాలిజ్‌కు మచాడో మద్దతు ఇచ్చారు. ప్రజాస్వామికంగా జరిగి ఉంటే ఆయనే ఎన్నికల్లో గెలిచేవారు. కానీ తానే ఎన్నికయ్యానని మెడ్యూరో ప్రకటించుకున్నారు. దీనితో వెజెజువెలాలోని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శనలు మొదలుపెట్టారు. ప్రభుత్వం ప్రజలను అణిచివేయటానికి ప్రయత్నించింది. ‘‘నన్ను చంపేస్తారని అనుమానం వచ్చింది. నన్ను నేను రక్షించుకుంటేనే.. ప్రజాస్వామ్యాన్ని రక్షించగలనని అనిపించింది. అందుకే అజ్ఞాతవాసానికి వెళ్లిపోయాను’’ అంటారు మచాడో.

అజ్ఞాత వాసం..

ప్రభుత్వ వేగుల నుంచి.. సైన్యం నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. అందుకే మచాడో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొనేది. ‘‘నా జుట్టును నేనే కత్తిరించుకొనేదాన్ని. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం- నాకు పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుడిని ప్రార్థించేదాన్ని..’’ అంటారామె! అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆమె అజ్ఞాతంలో ఉండే పోరాడుతున్నారు. ‘‘ఇది మంచి.. చెడుల మధ్య జరుగుతున్న పోరాటం. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటం. దీనిని గెలవటం అంత సులభం కాదని తెలుసు. కానీ చివరకు మంచే గెలుస్తుందని నాకు తెలుసు. ఆ క్షణం వచ్చేదాకా పోరాడాల్సిందే’’ అని అంటారు మచాడో. ఆమె ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలని ఆశిద్దాం.

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 06:05 AM