ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Celebrity Filled Celebration: నేత్ర పర్వం

ABN, Publish Date - Nov 23 , 2025 | 05:35 AM

ఉదయపూర్‌... డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు పెట్టింది పేరు. పీవీ సింధు, హార్దిక్‌ పాండ్యా, ఇషా అంబానీ, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, సంజయ్‌ హిందూజ... ఇలా ఎందరో ఇక్కడ వివాహ వేడుకలు జరుపుకున్నారు. తాజాగా ఈ కోవలోకే చేరనున్నారు...

ఉదయపూర్‌... డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు పెట్టింది పేరు. పీవీ సింధు, హార్దిక్‌ పాండ్యా, ఇషా అంబానీ, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, సంజయ్‌ హిందూజ... ఇలా ఎందరో ఇక్కడ వివాహ వేడుకలు జరుపుకున్నారు. తాజాగా ఈ కోవలోకే చేరనున్నారు...

నేత్ర మంతెన, వంశీ గాదిరాజు. వీరి పెళ్లి సంరంభం ఇప్పటికే ప్రారంభమైంది. అందులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ సహా పలువురు విదేశీ ప్రముఖులు కూడా భారత దేశానికి విచ్చేశారు. దీంతో నేత్ర, వంశీల వివాహం నెట్టింట చర్చనీయాంశమైంది.

ఎవరీ పెళ్లి కూతురు..?

అమెరికన్‌ బిలియనీర్‌ రామరాజు మంతెన కూతురే నేత్ర మంతెన. వీరిది తెలుగు మూలాలు ఉన్న కుటుంబం. రామరాజు.. జేఎన్‌టీయూ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయం నుంచి క్లినికల్‌ ఫార్మసీలో డిగ్రీని పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఇంజెనస్‌ ఫార్మాస్యూటికల్స్‌కు ఛైర్మన్‌, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొదిన ఐకోర్‌ హెల్త్‌ కేర్‌, ఇంటర్నేషనల్‌ అంకాలజీ నెట్‌వర్క్‌, ఆంకో స్ర్కిప్ట్స్‌ లాంటి గ్లోబల్‌ వెంచర్లను నిర్వహిస్తున్నారు. అమెరికా, స్విట్జర్లాండ్‌, ఇండియాల్లో ఫార్మా రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు పొందారు. ఎనిమిదేళ్ల క్రితం 28 కిలోల బంగారు సహస్ర నామ కాసుల హారాన్ని తిరుమల వేంకటేశ్వరునికి బహూకరించి వార్తల్లో నిలిచారు. నేత్ర తల్లి పద్మజ. ఈమె ఎవరో కాదు.. ఒకప్పటి బీజేపీ ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త అయిన గోకరాజు గంగరాజు కుమార్తె. ఆమె తండ్రిలాగే దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తుంటారు.

పెళ్లికొడుకు ఎవరు..?

నేత్రను పరిణయం చేసుకోబోయేది అమెరికాకు చెందిన వంశీ గాదిరాజు. ఈయన ప్రముఖ టెక్‌ ఇన్నోవేటర్‌. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పట్టా పొందారు. సూపర్‌ ఆర్డర్‌ అనే ఫుడ్‌ యాప్‌కు సహ వ్యవస్థాపకుడు. అంతేకాదు దానికి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలో ఫుడ్‌ అండ్‌ డ్రింక్‌ కేటగిరీ కింద చోటు సంపాదించారు.

అతిథులు

ఇప్పటికే దేశ విదేశాల నుంచి ప్రముఖ సెలబ్రిటీలు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. మేవారీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ జానపద నృత్యాలు, ఘూమర్‌ డ్యాన్స్‌లతో అతిథులను ఆహ్వానిస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, అతని స్నేహితురాలు ఈ వేడుకలకు హాజరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతని కోసం సుమారు 40 దేశాల నుంచి 126 మంది అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జస్టిన్‌ బీబర్‌, జెన్నిఫర్‌ లోపెజ్‌, టియెస్టో, బ్లాక్‌ కాఫీ, సిర్క్యు డు సోలైల్‌, డీజే అమన్‌ నాగ్‌పాల్‌ తదితర అంతర్జాతీయ ప్రదర్శనకారులు ముందుగానే వచ్చి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకుంటున్నాయి. హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌, జాన్వీ కపూర్‌, కరణ్‌ జోహార్‌, కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, మాధురీ దీక్షిత్‌, దియా మిర్జా తదితర బాలీవుడ్‌ స్టార్లు కూడా పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు.

వేదికలు

అరుదైన ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం పిచోలా సరస్సుపై ఉన్న జగ్‌ మందిర్‌ ఐలాండ్‌ ప్యాలె్‌సను సిద్ధం చేశారు. రాజసం ఉట్టిపడే ఈ భవనాన్ని లేక్‌ గార్డెన్‌ ప్యాలెస్‌ అని కూడా పిలుస్తుంటారు. లీలా ప్యాలెస్‌, జెనానా మహల్‌లలో కూడా వేడుకలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు తాజ్‌ లేక్‌ ప్యాలె్‌సలో హల్దీ, సంగీత్‌ కార్యక్రమాలు జరిగాయి. వీటిని కరణ్‌ జోహార్‌, సోఫీ చౌదరీలు హోస్ట్‌ చేశారు. సంగీత్‌ వేడుకల్లో రణ్‌వీర్‌ సింగ్‌ ఆడుతూ పాడుతూ డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ను అతని స్నేహితురాలిని డ్యాన్స్‌ ఫ్లోర్‌కు తీసుకెళ్లడంతో హాలంతా కేరింతలతో నిండిపోయింది. శనివారం.. మానెక్‌ చౌక్‌లో మెహందీ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఆదివారం.. ప్రధాన వివాహ ఘట్టం, రిసెప్షన్‌ తదితరాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

రైలు రద్దీగా ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా..

వాషింగ్‌మిషిన్ వాడేది దుస్తుల కోసమే అనుకుంటున్నారా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2025 | 05:35 AM