OTT: ఈ వారమే విడుదల
ABN, Publish Date - May 04 , 2025 | 05:49 AM
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలో ప్రముఖ ఓటీటీ వేదికలపై అనేక వెబ్‌సిరీస్‌లు, సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో 'గ్రామ్ చికిత్సాలయ్', 'బ్లాక్ వైట్ అండ్ గ్రే', 'ది ఫోర్ సీజన్స్' వంటి ఆసక్తికరమైన కంటెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...
వినోదాత్మక చికిత్స
ఓ మారుమూల పల్లెలో ప్రభుత్వ ఆస్పత్రి నేపథ్యంలో తెరకెక్కిన హిందీ సిరీస్ ‘గ్రామ్ చికిత్సాలయ్’. అక్కడి వసతుల లేమి, వైద్యుల నిర్లక్ష్యంతో అమాయక గ్రామీణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ వారి చేతుల్లో దోపిడీకి గురవుతుంటారు. ఈ పరిస్థితుల్లో బదిలీపై ఆ గ్రామానికి వచ్చిన ప్రతిభావంతుడైన యువ వైద్యుడు ప్రభాత్ ఆ పరిస్థితులను మార్చాలని కంకణం కట్టుకుంటాడు.
ఆ నేపథ్యంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి, ప్రజలు అతనికి సహకరించారా అనేది వినోదాత్మకంగా ఈ సిరీస్‌లో ఆవిష్కరించారు. అమోల్ పరాశర్ వినయ్ పాఠక్, ఆకాంక్ష రంజన్ కీలకపాత్రలు పోషించారు. రాహుల్ పాండే దర్శకుడు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..
Updated Date - May 04 , 2025 | 05:49 AM