ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cancer Vaccine Enteromix: క్యాన్సర్‌ టీకాలో నిజమెంత

ABN, Publish Date - Sep 23 , 2025 | 04:56 AM

రష్యా, తాజాగా క్యాన్సర్‌ను అడ్డుకునే ‘ఎంటెరోమిక్స్‌’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందనే వార్తలు వింటున్నాం. అయితే ఈ వ్యాక్సిన్‌తో అన్ని రకాల కాన్సర్ల నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చా? ఇది నిజం కాదని...

అవగాహన

రష్యా, తాజాగా క్యాన్సర్‌ను అడ్డుకునే ‘ఎంటెరోమిక్స్‌’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందనే వార్తలు వింటున్నాం. అయితే ఈ వ్యాక్సిన్‌తో అన్ని రకాల కాన్సర్ల నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చా? ఇది నిజం కాదని అంటున్నారు వైద్యులు. ఈ వ్యాక్సిన్‌ సామర్థ్యం, అడ్డుకునే క్యాన్సర్‌ రకం గురించి ఇలా వివరిస్తున్నారు.

ఒక టీకా అందుబాటులోకి రావాలంటే అది కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఒక టీకాను సురక్షితమైనదిగా, సమర్థమైనదిగా పరిగణించడం కోసం ప్రి క్లినికల్‌ స్టడీస్‌ చేపడతారు. ఈ స్టడీ్‌సలో భాగంగా టీకా ప్రభావాన్ని పరిశీలించడం కోసం మొదట జంతువుల మీద పరీక్షించడం జరుగుతుంది. ఈ పరీక్షలో టీకా వల్ల జంతువుల్లో ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించకుండా, సామర్థ్యం కూడా ఉన్నట్టు నిర్థారణ అయిన తర్వాతే మనుషుల మీద పరీక్షలు చేపట్టడం మొదలుపెడతారు. మనుషుల మీద చేపట్టే పరీక్షలు మూడు దశల్లో కొనసాగుతాయి. ఈ మూడు దశల్లో ఉత్తీర్ణత సాధించగలిగిన టీకా లేదా ఔషధాలను మాత్రమే మార్కెట్లోకి విడుదలవుతాయి. ఈ మూడు దశల్లో ఏ ఏ అంశాలను పరీక్షిస్తారంటే...

మొదటి దశ పరీక్ష: ఈ టీకాను 50 నుంచి 100 మందికి ఇస్తారు. రోగి భద్రతకు సంబంధించిన పరీక్ష ఇది. టీకా ఇచ్చినప్పుడు రోగి క్షేమంగా ఉన్నాడా, లేడా అన్నది ఈ పరీక్షలో పరిశీలిస్తారు. టీకా ఈ పరీక్ష నెగ్గితే, ఆ తర్వాత సామర్థ్యాన్ని పరీక్షిస్తారు

రెండో దశ పరీక్ష: ఇది సామర్థ్య పరీక్ష. ఈ పరీక్షలో టీకా సామర్థ్యంతో పాటు తర్వాతి దశ పరీక్షకు వెళ్లాలా, వద్దా అన్నది నిర్ణయిస్తారు. సదరు టీకాను క్యాన్సర్‌ నివారణకు ఉపయోగించుకోవచ్చా, లేదా అన్నది ఈ పరీక్షతో నిర్థారిస్తారు. అలాగే కొత్త టీకాతో కీమోథెరపీ తగ్గించుకునే వీలుందా, లేదా అన్నది కూడా పరీక్షిస్తారు.

మూడో దశ పరీక్ష: ఈ టీకాను సమాజంలోకి ప్రవేశపెట్టినప్పుడు, దీని ప్రభావం గణనీయంగా ఉంటుందా, లేదా అన్నది ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ పరీక్షలో ముందు నుంచి వాడుకలో ఉన్న ఔషధాలతో, తాజా టీకాను సరిపోల్చి చూస్తారు. కొత్త టీకా అదనపు ప్రయోజనాన్ని అందించగలుగుతుందా, లేదా అన్నది ఈ పరీక్షలో కనిపెడతారు. అలా అన్ని విధాలా గణాంక విశ్లేషణ చేసిన తర్వాతే టీకాను మనుషులకు ఉపయోగించవచ్చని నిర్థారిస్తారు. ముందు రెండు పరీక్షల్లో నెగ్గి, మూడో దశలో విఫలమైనా ఈ టీకా అందుబాటులోకి రాదు.

ఎంటెరోమిక్స్‌ పరిశోధన దశలోనే...

తాజా రష్యా టీకా ఎంటెరోమిక్స్‌, ఇంకా పరిశోధన దశలోనే ఉందనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. రష్యన్‌ ఫెడరల్‌ అండ్‌ మెడికల్‌ బయలాజికల్‌ ఏజెన్సీ, ఎంటెరోమిక్స్‌ను ‘ఎమ్‌ఆర్‌ఎన్‌ఎ’ వ్యాక్సిన్‌గా ప్రకటించింది. ప్రి క్లినికల్‌ ట్రయల్‌లో భాగంగా ఈ టీకాను జంతువుల మీద పరీక్షించినప్పుడు, వాటిలో కణితి పరిమాణం తగ్గినట్టు, ఈ టీకాతో జంతులు సురక్షితంగానే ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత మొదటి దశ పరీక్షలో భాగంగా పెగ్గపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న 48 మంది రోగులకు మాత్రమే ఈ టీకాను ఇవ్వడం జరిగింది. వీరిలో కూడా ఎటువంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. అయితే ఈ టీకా సామర్థ్యం కచ్చితంగా ఏ మేరకు ఉంటుందన్నది మున్ముందు చేపట్టబోయే రెండు, మూడో దశ పరీక్షల్లో మాత్రమే వెల్లడవుతుంది. దీన్నిబట్టి ఒకవేళ ఈ టీకా అన్ని పరీక్షలు ముగించుకుని అందుబాటులోకి వచ్చినా, ఇది అన్ని రకాల క్యాన్సర్లనూ నివారించదనీ, కేవలం పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటుందనే విషయం మర్చిపోకూడదు. అలాగే ఈ టీకా రెండు, మూడో దశ పరీక్షలు పూర్తి చేసుకోవడానికి కూడా కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. కాబట్టి అర్థం లేని అపోహలను విశ్వసించకుండా, అన్ని పరీక్షలు ముగించుకుని ఈ టీకా అందుబాటులోకి వస్తుందనే ఆశావహ ధృక్పథంతో నడుచుకోవడం ఉత్తమం.

డాక్టర్‌ సుమంత్‌ కుమార్‌ మల్లుపట్టు

సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ హెమటో ఆంకాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 04:56 AM