ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మగువలు మెచ్చేవి ఇవే...

ABN, Publish Date - Sep 14 , 2025 | 12:22 PM

ఆపద సమయాల్లో ఆత్మరక్షణకు... గర్భిణులు సాఫీగా నిద్రపోయేందుకు... ఆఫీసులో గంటల తరబడి కూర్చున్నా, పాదాలు వాపు రాకుండా ఉండేందుకు... ఇలాంటి కొన్ని మహిళకు సంబంధించిన సమస్యలకు, పరిష్కారాన్ని చూపే ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్‌ ఉన్నాయి. వాటి విశేషాలే ఇవి...

ఆపద సమయాల్లో ఆత్మరక్షణకు... గర్భిణులు సాఫీగా నిద్రపోయేందుకు... ఆఫీసులో గంటల తరబడి కూర్చున్నా, పాదాలు వాపు రాకుండా ఉండేందుకు... ఇలాంటి కొన్ని మహిళకు సంబంధించిన సమస్యలకు, పరిష్కారాన్ని చూపే ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్‌ ఉన్నాయి. వాటి విశేషాలే ఇవి...

సాఫీగా నడుం వాల్చొచ్చు...

గర్భం ధరించిన తర్వాత కొందరు మహిళలు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ నొప్పి వల్ల నిద్ర పోయేటప్పుడు అసౌకర్యంగా ఉంటుంది. అదే ‘మెటర్నిటీ పిల్లో’ ఉంటే ఆ బాధ ఉండదు. ఈ దిండు వీపు, బెల్లీ, హిప్స్‌, మోకాళ్లకు సపోర్ట్‌గా ఉంటుంది. నిద్రించేటప్పుడు కాళ్లపై పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ దిండును కావాల్సిన విధంగా అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ బ్యాగ్‌

హ్యాండ్‌బ్యాగ్‌లో డబ్బులు, కార్డులు, విలువైన వస్తువులు ఉన్నప్పుడు దాన్ని ఎక్కడైనా పెట్టాలంటే కాస్త జంకుతాం. అదే ‘స్మార్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ హ్యాండ్‌ బ్యాగ్‌’తో నిశ్చింతగా ఉండొచ్చు. దీనికి ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుంది. దానిపై వేలిని ఉంచితేనే బ్యాగ్‌ తెరుచుకుంటుంది. బ్యాటరీ సాయంతో ఈ టెక్నాలజీ పని చేస్తుంది.

ఆపదలో రక్షణగా...

ఆపద ఎదురైనప్పుడు తెలివిగా తప్పించుకునేందుకు సాయపడే ‘సేఫ్టీ రింగ్‌’ ఇది. పదునుగా మొనదేలి ఉన్న ఈ రింగ్‌ని రాత్రిపూట ఒంటరిగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు చేతివేలుకి ధరిస్తే సరి. ఈ రింగ్‌తో ధైర్యంగా అపరిచిత వ్యక్తిపై ప్రతి దాడి చేసి తప్పించుకోవచ్చు. సైడ్‌కు ఉన్న బటన్‌ను నొక్కితే ఇది ఓపెన్‌ అవుతుంది.

ఒలికిపోదు

సాధారణంగా నెయిల్‌ పాలిష్‌ బాటిల్‌ను చేతితో పట్టుకుని వేసుకునేటప్పుడు... ఒక్కోసారి ఒలికిపోతుంది. అదే ‘నెయిల్‌ పాలిష్‌ హోల్డర్‌’ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాయిగా నెయిల్‌పాలిష్‌ వేసుకోవచ్చు. హోల్డర్‌కి నెయిల్‌పాలిష్‌ సీసాను తగిలించి.. అవసరానికి అనుగుణంగా కావాల్సిన ఎత్తులో సులువుగా సర్దుబాటు చేసుకోవచ్చు.

పాదాలు వాపు రాకుండా...

ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చోవడం వల్ల కొందరికి సాయంత్రానికి పాదాలు వాపులొస్తాయి. గర్భిణుల్లోనూ ఈ సమస్య ఉంటుంది. దీనికి పరిష్కారమే ‘ఫుట్‌ హామోక్‌’. చిన్నసైజు ఊయలలా ఉండే దీనిని డెస్క్‌ కింది భాగంలో అమర్చుకోవాలి. అందులో పాదాల్ని ఉంచి.. పైకీ కిందకు, ముందుకూ వెనక్కి అంటుంటే వ్యాయామంలాగా ఉంటుంది. ఇరువైపులా ఉండే బెల్టుకు ఎలాస్టిక్‌ ఉండటంతో కావాల్సినంత సాగుతుంది.

Updated Date - Sep 14 , 2025 | 12:22 PM