ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Summer: చమట పొక్కులకు చెక్‌

ABN, Publish Date - Mar 18 , 2025 | 04:08 AM

వేసవిలో పిల్లలను వేధించే ప్రధాన సమస్య... చమట పొక్కులు. ఈ సమస్య నుంచి పిల్లలకు ఉపశమనం కలగడం కోసం కొన్ని చిట్కాలను పాటించవచ్చు. అవేంటంటే...

రీరంపై చమట ఆరిపోవడం లేదా, చర్మపు ముడతల్లో చమట, మట్టి పేరుకుపోవడం మూలంగా చమట పొక్కులు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఈ కాలంలో ఇబ్బంది పెడతాయి. సాధారణంగా మామిడి పండ్లు తినడం వల్ల వేడిచేసి సెగ గడ్డలు మొదలయ్యాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ సెగ గడ్డలకు కారణం చర్మం మీద చమట ఇంకిపోయి, చర్మ రంథ్రాలు మూసుకుపోయి, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడమే! చమట పొక్కులు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, సెగ గడ్డలు పిల్లలను వేధించకుండా ఉండాలంటే రోజుకు రెండు పూటలా స్నానం చేయిస్తూ ఉండాలి. వీటికి తోడు ఈ అదనపు జాగ్రత్తలు కూడా పాటించాలి.

చల్లని వాతావరణం: చల్లనీటి స్నానంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి, ఉపశమనం కలుగుతుంది. అలాగే పిల్లలు గాలి ధారాళంగా చొరబడే వీలున్న చల్లని గదుల్లోనే ఉండాలి

దుస్తులు: తేలికగా, చమటను పీల్చుకునే, గాలి చొరబడే వీలున్న మెత్తని దుస్తులనే పిల్లలకు వేయాలి

ఉపశమనం: పొక్కిన ప్రదేశంలో దురద, మంటలను తొలగించడం కోసం చల్లని తడి వస్త్రాన్ని కప్పి ఉంచవచ్చు. లేదా వస్త్రంలో మంచు ముక్కలను ఉంచి, కాపడం పెట్టుకోవచ్చు

ఆయింట్‌మెంట్లు: జిడ్డుగా ఉండే తైలాలు, ఆయింట్‌మెంట్లు పూయకూడదు

గోకకూడదు: చమట పొక్కులు వచ్చిన ప్రదేశాల్లో దురద సహజం. కాబట్టి పిల్లలు అదే పనిగా గోక్కునే ప్రయత్నం చేస్తారు. దాంతో పుండ్లు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉపశమనం దక్కడం కోసం ఆయా ప్రదేశాల్లో సున్నితంగా రుద్దాలి

ఓట్‌మీల్‌: చర్మం మంట తగ్గడం కోసం స్నానం నీళ్లకు ఓట్‌మీల్‌ జోడించాలి

సోడా ఉప్పు: చర్మరంథ్రాలు తెరుచుకుని, ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడం కోసం రెండు స్పూన్ల సోడా ఉప్పును స్నానం చేసే నీళ్లలో కలుపుకోవాలి


నియంత్రణ ఇలా...

నీళ్లు: శరీరంలో నీరు తరిగిపోకుండా చూసుకుంటే చమట పొక్కుల సమస్య తలెత్తకుండా ఉంటుంది. కాబట్టి పిల్లలు సరిపడా నీళ్లు తాగుతున్నారో లేదో గమనించుకుంటూ ఉండాలి

అలసట: ఎండలో ఎక్కువసేపు ఆడుతూ చమటలు పట్టకుండా చూసుకోవాలి

పౌడర్‌: అదనపు చమటను పీల్చుకునేలా చమట పట్టే వీలున్న ప్రదేశాల్లో టాల్కమ్‌ పౌడర్‌ చల్లాలి. అయితే అవసరానికి మించి పౌడర్‌ చల్లితే, చర్మ రంథ్రాలు మూసుకుపోయి చమటపొక్కులు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి పౌడర్‌ను పరిమితంగా వాడుకుంటూ, రెండు పూటలా స్నానం చేయిస్తూ ఉండాలి

వైద్యులను ఎప్పుడు కలవాలి?

మూడు రోజులు దాటినా చమట పొక్కులు తగ్గనప్పుడు

చమట పొక్కుల తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నప్పుడు

చమట పొక్కులు చీము పట్టినప్పుడు

చమట పొక్కులకు జ్వరం తోడైనప్పుడు


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 04:08 AM