ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సొబగులతో
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:03 AM
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పాత ఫ్యాషన్ అనుకుంటే పొరపాటు. నేడు అదే పోకడ మళ్లీ మొదలైంది. ఆకర్షణీయైున ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్లను అద్దుకున్న చీరలను నేటి మహిళలందరూ....
ఫ్యాషన్
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పాత ఫ్యాషన్ అనుకుంటే పొరపాటు. నేడు అదే పోకడ మళ్లీ మొదలైంది. ఆకర్షణీయైున ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్లను అద్దుకున్న చీరలను నేటి మహిళలందరూ ఆదరిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.
సింథటిక్, కాటన్, జూట్... ఇలా అన్ని రకాల చీరల మీదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్లు కనిపించడం మొదలుపెట్టాయి. పూలు, లతలు, టెంపుల్ డిజైన్లతో కూడిన చీరలు తాజా ఫ్యాషన్‌గా చలామణి అవుతున్నాయి. అయితే ఏ చీర ఎవరికి నప్పుతుందో, ఏ చీరను ఎలాంటి బ్లౌజ్‌తో జత చేయాలో, ఎలాంటి యాక్సెసరీస్‌తో జోడించాలో తెలుసుకోవడం అవసరం.
ఒంటికి మెత్తగా తగిలే కాటన్ చీరలు మహిళలందరికీ నప్పుతాయి. అయితే వీటి మీద అద్దే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్లను జాగ్రత్తగా గమనించాలి. లేత రంగుల్లో, చిన్నపాటి డిజైన్లు కలిగి ఉండే కాటన్ చీరలు ఎత్తు తక్కువ మహిళలకు అందాన్నిస్తాయి. పెద్ద పెద్ద పూలు, లతలు కలిగిన డిజైన్ చీరలను ఎత్తైన మహిళలు ఎంచుకోవాలి.
రంగుల మధ్య కాంట్రాస్ట్ ఉండేలా చూసుకోవాలి. లేత ఆకుపచ్చ - గులాబీ రంగు, నీలం - తెలుపు, నలుపు - ఎరుపు... ఇలాంటి రంగుల సమ్మేళనాలను ఎంచుకుంటే రెట్టింపు ఆకర్షణీయంగా కనిపిస్తారు.
చిన్న పాటి డిజైన్లు కలిగిన చీరను ఎంచుకున్నప్పుడు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కలిపి కట్టుకోవాలి. పెద్ద పెద్ద డిజైన్ల చీరలను ప్లెయిన్ బ్లౌజ్‌తో జత చేయాలి.
ఫ్యాబ్రిక్ పెయింట్ అద్దిన చీరలను తేలికపాటి యాంటిక్ జ్యువెలరీతో మ్యాచ్ చేయాలి. ఇందుకోసం జర్మన్ సిల్వర్, టెర్రకోటా జ్యువెలరీ ఎంచుకోవచ్చు.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 25 , 2025 | 05:03 AM