ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Top Celebrity Makeup Trends 2025: సెలెబ్‌ మేకప్‌ ట్రెండ్స్‌

ABN, Publish Date - Oct 25 , 2025 | 04:52 AM

అందరూ వేసుకునే మేకప్‌ ఇంచుమించు ఒకేలా ఉన్నా... ప్రముఖులు మాత్రం మేక్‌పలో భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. అందుకు వాళ్లు అనుసరించే విభిన్నమైన మేకప్‌ ట్రెండ్స్‌ ప్రధాన కారణం. ఆ వినూత్నమైన ట్రెండ్స్‌ను అనుసరించి మనం కూడా వారిలాగే వెలిగిపోదామా...

అందరూ వేసుకునే మేకప్‌ ఇంచుమించు ఒకేలా ఉన్నా... ప్రముఖులు మాత్రం మేక్‌పలో భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. అందుకు వాళ్లు అనుసరించే విభిన్నమైన మేకప్‌ ట్రెండ్స్‌ ప్రధాన కారణం. ఆ వినూత్నమైన ట్రెండ్స్‌ను అనుసరించి మనం కూడా వారిలాగే వెలిగిపోదామా...

సాఫ్ట్‌ గ్లామ్‌, మినిమలిస్ట్‌, మోనోక్రోమ్‌, బోల్డ్‌ అనే నాలుగు రకాల మేకప్‌ ట్రెండ్స్‌ను ప్రస్తుత భారతీయ ప్రముఖులు పాటిస్తున్నారు. అద్దంలా మెరిసే గ్లాస్‌ స్కిన్‌, సహజసిద్ధ కనుబొమలు, మెటాలిక్‌ ఐషాడోలు, న్యూడ్‌ లిప్స్‌ కూడా నేటి మేకప్‌ ట్రెండ్స్‌లో భాగాలుగా చెలామణీ అవుతున్నాయి.

సాఫ్ట్‌ గ్లామ్‌: ముఖంలో ఎక్కడా తీర్చిదిద్దినట్టు కనిపించకుండా న్యూడ్‌, డ్యూయి ఎలిమెంట్స్‌ను కలిపేసే మేకప్‌ ట్రెండ్‌ ఇది.కాటుక కళ్లు, మందపాటి కనుబొమలు, లేత రంగు పెదవులు ఈ ట్రెండ్‌ ప్రత్యేకతలు

మినిమలిస్ట్‌: తాజాదనం ఉట్టిపడే సింపుల్‌ మేకప్‌కు పెద్ద పీట వేస్తూనే బ్లష్‌, ముదురు రంగు లిప్‌స్టిక్‌లను జోడించడం ఈ మేకప్‌ ట్రెండ్‌ ప్రత్యేకత

మోనోక్రోమ్‌: కళ్లు, పెదవులు, చెక్కిళ్ల మీద ఒకే రంగును ఉపయోగించడం ఈ మేకప్‌ ప్రత్యేకత

బోల్డ్‌: ప్రత్యేకమైన సందర్భాల్లో ఎంచుకునే మేకప్‌ ట్రెండ్‌ ఇది. కొట్టొచ్చినట్టు కనిపించే స్మోకీ ఐస్‌, మెటాలిక్‌ షిమ్మర్‌ అద్దుకున్న కనురెప్పలు, మందపాటి ఐలైనర్‌లను ఈ మేక్‌పలో ఉపయోగిస్తారు. పెదవుల పైకి దృష్టి మళ్లకుండా ఉండడం కోసం న్యూడ్‌ లిప్స్‌ను ఎంచుకుంటారు.

కీలకమైన ఆకర్షణలు ఇవే!

చర్మం: అద్దంలా మెరుపులీనే గ్లాస్‌ స్కిన్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది

కనుబొమలు: ఒత్తుగా, పట్టుకుచ్చులా కనిపించే కనుబొమలు మరింత సహజసిద్ధ లుక్‌ను తెచ్చిపెడతాయి

కళ్లు: గ్రే లేదా లైలాక్‌ మెటాలిక్‌ షేడ్స్‌లో మెరిసే ఐషాడోతో పాటు, కళ్లకు కాటుక దిద్దుకోవాలి. అలాగే కనురెప్పల పైన మందంగా ఐలైనర్‌ అప్లై చేసుకోవాలి

పెదవులు: పెదవులకు న్యూడ్‌ నుంచి బోల్డ్‌ వరకూ ఎలాంటి రంగునైనా ఎంచుకోవచ్చు. ఫుల్లర్‌ లిప్స్‌లా కనిపించడం కోసం ఓవర్‌ లైన్‌డ్‌ లిప్స్‌ స్టైల్‌ ఎంచుకోవాలి.

Updated Date - Oct 25 , 2025 | 04:52 AM