ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇల్లు అందంగా

ABN, Publish Date - Jun 19 , 2025 | 01:51 AM

ఇంట్లోకి ప్రవేశించగానే తాజాగా అహ్లాదకరమైన అనుభూతి కలిగేలా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అందుబాటులో ఉన్నవాటితోనే ఇంటిని అందంగా అలంకరించుకుంటారు కూడా...

ఇంట్లోకి ప్రవేశించగానే తాజాగా అహ్లాదకరమైన అనుభూతి కలిగేలా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అందుబాటులో ఉన్నవాటితోనే ఇంటిని అందంగా అలంకరించుకుంటారు కూడా. ఇలా ఇంటిని మరింత శోభాయమానంగా మార్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే....

  • ఇంటిని పూర్తిగా ఫర్నిచర్‌తో నింపేయకూడదు. ఇంటి విస్తీర్ణాన్ని అనుసరించి ఫర్నిచర్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు చిన్నగా ఉంటే మల్టీపర్పస్‌ ఫర్నిచర్‌ను ఎంచుకోవచ్చు. ఇంట్లో సామాన్లను చిందరవందరగా పడేయకుండా ఎక్కడికక్కడ పొందికగా సర్దుకోవాలి.

  • ఇంట్లోకి రాగానే హాల్‌ విశాలంగా వెలుతురుతో కనిపిస్తే బాగుంటుంది. సోఫా వెనక గోడకి పోల్కా డాట్స్‌, పేపర్‌ ఫ్యాన్‌లు, చిన్న చిన్న పూలచెట్లు-సరస్సు-ఎగిరే పక్షుల డిజైన్లతో ఉన్న స్టిక్కర్లు అంటిస్తే ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సోఫాకి ఇరుపక్కలా మొక్కల కుండీలు పెడితే తాజా అనుభూతి కల్గుతుంది. సోఫా మీద వెల్వెట్‌ పిల్లోలు, టీపాయ్‌ మీద ఫ్లవర్‌ వాజ్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

  • ఇల్లు అందంగా కనిపించేలా చేయడంలో కర్టెన్లదే ప్రధాన పాత్ర. లేత రంగుల్లో డిజిటల్‌ ప్రింటింగ్‌ ఉన్న కర్టెన్లు ఇంటికి శోభనిస్తాయి. కిటికీలకు రకరకాల పక్షులు, పచ్చిక బయళ్లు, సాగర తీరాలు, రాజభవనాల బొమ్మలతో కూడిన కర్టెన్లు వేస్తే ఇంటికి మరే ప్రత్యేకమైన అలంకరణ అవసరం ఉండదు.

  • వంటగదిని సౌకర్యవంతంగా ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా చాలా ముఖ్యం. అల్మరాలు, కప్‌బోర్డులకు అందమైన లామినేషన్‌ షీట్లు అమరిస్తే చూడడానికి బాగుంటుంది. సిరామిక్‌, క్రిస్టల్‌, పీవీసీ, చెక్క సామాగ్రిని వాడితే వంటగది ఆకర్షణీయంగా ఉంటుంది.

  • పడక గది, పిల్లల గది చిన్నగా ఉన్నాయనిపిస్తే నేలమీద చిన్నపాటి కార్పెట్‌ పరచి గది మూలల్లో పొడవుగా పెరిగే మొక్కల కుండీలు పెడితే చాలు గది విశాలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 01:15 PM