Digital Detox: స్ర్కీన్ టైమ్ తగ్గించుకుందామిలా..
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:06 AM
పిల్లలు, పెద్దలు అందరిలో ఫోన్ వినియోగం పెరిగిపోయింది...
పిల్లలు, పెద్దలు అందరిలో ఫోన్ వినియోగం పెరిగిపోయింది. గంటల తరబడి ఫోన్‌లు చూస్తూ గడిపేస్తున్నారు. అయితే స్ర్కీన్ టైమ్ తగ్గించుకునేందుకు చిట్కాలు..
యాప్స్‌ను ఎంత సమయం వాడలన్నది టైమర్ సెట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ సమయం పూర్తవగానే ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. దాంతో ఫోన్ పక్కన పెట్టేయవచ్చు.
తినేటప్పుడు, పడకగదిలో వంటి చోట్ల ఫోన్ వాడకూడదని నిర్ణయించుకుని పాటించండి. ఆ సమయంలో కుటుంబసభ్యులతో మాట్లాడడం చేయాలి.
ప్రతిరోజూ కొంత సమయం డిజిటల్ బ్రేక్‌గా పెట్టుకుని అనుసరించండి. ఆ సమయంలో ఫోన్ అసలే ముట్టుకోవద్దు.
నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడల్లా అవసరం లేకపోయిన ఫోన్ చూస్తుంటాం. అందుకే అత్యవసరమైన నోటిఫికేషన్‌లు మినహా మిగతావన్నీ ఆఫ్ చేసుకోవాలి.
పనివేళలు, నిద్రపోయే సమయంలో డునాట్ డిస్టర్బ్ మోడ్‌ను ఆన్ చేసుకోండి. దీనివల్ల ప్రశాంతంగా పని చేసుకోవచ్చు, పడుకోవచ్చు.
అలారం కోసం ఫోన్ వాడకూడదు. గడియారాన్నే వాడడం అలవాటు చేసుకోవాలి.
ఫోన్ వాడడం తగ్గించి ఆ సమయంలో పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా కుటుంబంతో గడపడం చేయాలి.
Updated Date - Jul 12 , 2025 | 12:06 AM