ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Beauty and Makeup tips: అందం ఇలా సొంతం

ABN, Publish Date - Nov 08 , 2025 | 04:36 AM

సౌందర్య సాధనాలను ఎంచుకోవడంతో పాటు, వాటిని ఉపయోగించే విధానం పట్ల కూడా అవగాహన కలిగి ఉండడం అవసరం. అందుకు తోడ్పడే చిట్కాలు ఇవే...

సౌందర్య సాధనాలను ఎంచుకోవడంతో పాటు, వాటిని ఉపయోగించే విధానం పట్ల కూడా అవగాహన కలిగి ఉండడం అవసరం. అందుకు తోడ్పడే చిట్కాలు ఇవే!

లిప్‌స్టిక్‌: పెదవులు పొడిబారకుండా ఉండడం కోసం, గీతలు పడకుండా ఉండడం కోసం మాయిశ్చరైజింగ్‌ లిప్‌స్టిక్‌ ఎంచుకోవాలి. లిప్‌లైనర్‌తో ఔట్‌లైన్‌ గీసుకోవడం అందరికీ తెలిసిందే! అయితే అందుకోసం ఉపయోగించే లైనర్‌, లిప్‌స్టిక్‌ కంటే ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి.

ఐ బ్రో పెన్సిల్‌: కనుబొమలకు నలుపు రంగు ఐ బ్రో పెన్సిల్‌కు బదులుగా డార్క్‌ బ్రౌన్‌, డల్‌ బ్లాక్‌ పెన్సిల్‌ వాడాలి. అప్పుడు కనుబొమలు సహజంగా కనిపిస్తాయి.

ఐ లైనర్‌: కనురెప్పల మీద వేసుకునే ఐలైనర్‌ వాటర్‌ప్రూఫ్‌ అయి ఉండాలి. ఐలైనర్‌ వేసుకునే పద్ధతిని ప్రాక్టీస్‌ చేసుకుంటే, తక్కువ సమయంలోనే కళ్లను తీర్చిదిద్దుకోవచ్చు.

గ్లిట్టర్‌: నైట్‌ మేక్‌పలో గ్లిట్టర్‌ ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెడుతుంది. అయితే అందుకోసం గ్లిట్టర్‌ను పరిమితంగా వాడుకోవాలి. కనురెప్పలు, చెంపలకు తగుమాత్రంగా అద్దుకోవాలి.

టోనర్‌: చర్మం నునుపుగా, బిగుతుగా మేక్‌పకు అనువుగా మారడం కోసం టోనర్‌ వాడడం తప్పనిసరి. అలాగే మొటిమలు, మచ్చలు ఉన్న చోట టోనర్‌ను అప్లై చేసుకుని, వాటిని కనిపించకుండా దాచేయవచ్చు.

మాయిశ్చరైజర్‌: మేకప్‌ సమంగా పరుచుకోవడం కోసం మేకప్‌కు ముందు మాయిశ్చరైజర్‌ వాడుకోవాలి. మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల చర్మం మీద మేకప్‌ పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది.

ప్రైమర్‌: చర్మానికీ, మేక్‌పకూ మధ్య ప్రైమర్‌ అడ్డుగా ఉండి, చర్మం మీది రంధ్రాలు కనిపించకుండా చేస్తుంది. దీంతో చర్మ రంధ్రాలు పూడుకుపోకుండా ఉంటాయి.

ఫౌండేషన్‌: స్కిన్‌ టోన్‌ను సమం చేసి, మేక్‌పకు బేస్‌గా మారుతుంది. కాబట్టి, ఫౌండేషన్‌ను ముఖం మీద సమంగా పరుచుకోవాలి.

కన్‌సీలర్‌: చర్మపు రంగుకు ఒకటి లేదా రెండు టోన్ల తేలిక రంగు కన్‌సీలర్‌ ఎంచుకోవాలి. దీంతో మచ్చలను దాచేసి, ముఖంలో కనురెప్పలు, ముక్కు, చుబుకం, చెక్కిళ్లను హైలైట్‌ చేసుకోవచ్చు.

కాంటూర్‌: దీంతో ముఖానికి ఆకారాన్ని తీసుకురావచ్చు. ముక్కు, చుబుకం, చెక్కిళ్లను ఆకర్షణీయంగా మలుచుకోవచ్చు.

బ్లష్‌: చెక్కిళ్లను హైలైట్‌ చేయడం కోసం దీన్ని వాడుకోవాలి.

Updated Date - Nov 08 , 2025 | 04:36 AM