ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Simple and Tasty Recipes: సింగాడాతో సింపుల్‌గా...

ABN, Publish Date - Dec 13 , 2025 | 04:55 AM

చలికాలం రాగానే నల్లని సింగాడాలు రాశులు పోసి కనిపిస్తుంటాయి. వీటిని మధ్యకు కోస్తే లోపల తెల్లని పదార్థం కమ్మటి రుచితో ఉంటుంది....

చలికాలం రాగానే నల్లని సింగాడాలు రాశులు పోసి కనిపిస్తుంటాయి. వీటిని మధ్యకు కోస్తే లోపల తెల్లని పదార్థం కమ్మటి రుచితో ఉంటుంది. దీన్ని ఎండబెట్టి పిండి పట్టించి నిల్వ చేసుకుంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలప్పుడు ఈ పిండితో రకరకాల వంటకాలు చేసుకుని తింటూ ఉంటారు. ఎన్నో పోషకాలతో నిండిన సింగాడాలను సరికొత్తగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...

ఖీర్‌

కావాల్సిన పదార్థాలు

సింగాడాలు- ఒక కేజీ, పాలు- రెండు లీటర్లు, బాదం పప్పులు- పది, పిస్తా పప్పులు- పది, జీడిపప్పులు- పది, కిస్‌మిస్‌లు- పది, చక్కెర- ఒక కప్పు, యాలకులు- అయిదు

తయారీ విధానం

బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కుక్కర్‌లో సింగాడాలు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వీటిని చల్లార్చి తొక్క తీసి బ్లెండర్‌లో వేయాలి. అందులో ఒక గ్లాసు పాలు పోసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి మిగిలిన పాలు పోసి మరిగించాలి. అందులో సింగాడా పేస్ట్‌, చక్కెర వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కగా మారి దగ్గరకు వచ్చిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఆపైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులతోపాటు కిస్‌మిస్‌లు చల్లి సర్వ్‌ చేసుకోవాలి.

షాహి కర్రీ

కావాల్సిన పదార్థాలు

సింగాడాలు- 20, ఉల్లిపాయలు- రెండు, నెయ్యి- రెండు చెంచాలు, జీలకర్ర- ఒక చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, టమాటా గుజ్జు- ఒకటిన్నర కప్పులు, ధనియాల పొడి- ఒక చెంచా, జీలకర్ర పొడి- ఒక చెంచా, కారం- ఒక చెంచా, పసుపు- అర చెంచా, జీడిపప్పు పేస్టు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, గరం మసాలా పొడి- అర చెంచా, కసూరి మేథి- ఒక చెంచా, ఫ్రెష్‌ క్రీమ్‌- రెండు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు, కొత్తిమీర- కొద్దిగా

తయారీ విధానం

  • కుక్కర్‌లో సింగాడాలు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వాటికి తొక్క తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరగాలి.

  • స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అందులో నెయ్యి వేసి వేడిచేయాలి. ఆపైన జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరువాత టమాటా గుజ్జు వేసి కలపాలి. పాన్‌ మీద మూతపెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, జీడిపప్పు పేస్టు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మరోసారి బాగా కలపాలి. ఈ గ్రేవీ మిశ్రమం బాగా ఉడికి దగ్గరకు వచ్చాక గరం మసాలా పొడి, కసూరి మేథి, ఫ్రెష్‌ క్రీమ్‌ వేసి కలపాలి. తరువాత ఉడికించిన సింగాడాలు వేసి కలిపి మరో అయిదు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా నిమ్మరసం కలిపి కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ సింగాడా షాహి కర్రీ... వేడి అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.

సలాడ్‌

కావాల్సిన పదార్థాలు

తాజా సింగాడాలు- 12, కీరా- ఒకటి, వేయించి పొట్టు తీసిన పల్లీలు- రెండు చెంచాలు, ఎండుమిర్చి- మూడు, కొత్తిమీర తరుగు- ఒక చెంచా, పుదీనా ఆకులు- అయిదు, నిమ్మకాయ- ఒకటి, ఉప్పు- తగినంత, పంచదార- అర చెంచా

తయారీ విధానం

  • తొక్క తీసిన సింగాడాలను ఒక గిన్నెలో వేసి నిండా చల్లటి నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత వాటిని సన్నని చక్రాల్లా కోయాలి. కీరాను కూడా తొక్కతీసి నాలుగు ముక్కలుగా కోయాలి. మధ్యలో ఉన్న గింజల భాగాన్ని కోసి తీసివేయాలి. తరువాత కీరాను సన్నని పొడవైన ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బ్లెండర్‌లో పల్లీలు, ఎండు మిర్చి ముక్కలు వేసి కచ్చాపచ్చాగా బ్లెండ్‌ చేయాలి.

  • వెడల్పాటి గిన్నెలో సింగాడా చక్రాలు, కీరా ముక్కలు, పల్లీలు-ఎండు మిర్చి మిశ్రమం, ఉప్పు, పంచదార, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి. అంతే సింగాడా సలాడ్‌ రెడీ..!

Updated Date - Dec 13 , 2025 | 04:59 AM