Setubandha Sarvangasana Benefits: ఈ ఆసనంతో కుంగుబాటు దూరం
ABN, Publish Date - Aug 11 , 2025 | 04:38 AM
మానసిక కుంగుబాటు తొలగి, మనసు తేలికపడే ఆసనాల్లో చెప్పుకోదగినది ‘సేతుబంధ సర్వాంగాసనం’. ఈ ఆసనం ఎలా వేయాలంటే...
ఫిట్‌నెస్
మానసిక కుంగుబాటు తొలగి, మనసు తేలికపడే ఆసనాల్లో చెప్పుకోదగినది ‘సేతుబంధ సర్వాంగాసనం’. ఈ ఆసనం ఎలా వేయాలంటే...
నేల మీద వెల్లకిలా పడుకుని, మెడ అడుగున టవల్ చుట్టి పెట్టుకోవాలి.
మోకాళ్లను మడిచి, పాదాలు, చేతులకు నేలకు సమాంతరంగా ఉంచాలి.
గాలిని వదులుతూ చేతులు, పాదాల మీద బరువుంచి, నడుమును పైకి లేపాలి.
ఈ భంగిమలో 10 అంకెలు లెక్కపెట్టి, తిరిగి మామూలు స్థితికి రావాలి.
ఇలా 5 నుంచి పది సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
ఉపయోగాలు ఇవే! : ఛాతీ, వెన్ను, మెడ, పిరుదులు ఈ ఆసనంతో సాగుతాయి. మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్లు తగ్గుతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ, మెదడు సాంత్వన పొందుతాయి. అజీర్తి తొలగి, మెనోపాజ్ లక్షణాలు తగ్గుముఖం పడతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News
Updated Date - Aug 11 , 2025 | 04:38 AM