ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sania Mirza: పోరాటమే నా భాష

ABN, Publish Date - Dec 31 , 2025 | 03:46 AM

టెన్నిస్‌ రాకెట్‌ పట్టినా.. మైక్రోఫోన్‌ ముందు కూర్చున్నా ఆమె శైలే వేరు. గెలుపోటములను సమానంగా స్వీకరించి వ్యక్తిగత జీవితంలోని తుపానులను సైతం చిరునవ్వుతో...

టెన్నిస్‌ రాకెట్‌ పట్టినా.. మైక్రోఫోన్‌ ముందు కూర్చున్నా ఆమె శైలే వేరు. గెలుపోటములను సమానంగా స్వీకరించి వ్యక్తిగత జీవితంలోని తుపానులను సైతం చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడిన ధీశాలి ఆమె. క్రీడాకారిణిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. జీవితపు రెండో ఇన్నింగ్స్‌లో ‘పాడ్‌కాస్టర్‌’ అవతారమెత్తారు. ఈ సందర్భంగా సానియా పలు విషయాలను పంచుకున్నారు.

సానియా మీర్జా కొత్త పాడ్‌కాస్ట్‌ ‘సర్వింగ్‌ ఇట్‌ అప్‌ విత్‌ సానియా’ ఇప్పుడు డిజటల్‌ ప్రపంచంలో సెన్షేషన్‌. సెలబ్రిటీల గురించి మనం పైపైన చూసే విషయాల కంటే వారిలోని అసలైన మనుషులను ఆవిష్కరించే ప్రయత్నమిది. ‘‘క్రీడలే నా ప్రపంచం, కానీ నా అంతరంగం కేవలం మైదానానికే పరిమితం కాదు. ఎన్నో ఏళ్లుగా నా సన్నిహితులతో, స్నేహితులతో సోఫా మీద కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే ఆత్మీయ సంభాషణలను కెమెరా ముందుకు తీసుకురావాలనే ఆలోచనే ఈ షో. ఇది ముందే రాసుకున్న స్ర్కిప్ట్‌ కాదు. రెండు హృదయాల మధ్య జరిగే సహజమైన ప్రయాణం’’ అని తన కొత్త ప్రాజెక్ట్‌ వెనకున్న ఉద్దేశాన్ని వివరించారు సానియా.

సవాళ్లే సోపానాలు

గడచిన కాలంలో సానియా వ్యక్తిగత జీవితంపై ఎన్నో చర్చలు నడిచాయి. కానీ, ఏనాడూ ఆమె తడబడలేదు. మౌనంగానే తన హుందాతనాన్ని చాటుకున్నారు. ‘‘నిజాయితీగా ఉండటం నా బలం. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కుంగిపోవడం సహజం, కానీ వాటిని తట్టుకుని నిలబడటమే అసలైన విజయం. నాకు ఆ శక్తి క్రీడల నుంచి, నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ప్రతి రోజు మన ప్రణాళిక ప్రకారం సాగదు. కొన్నిసార్లు సవాళ్లు ఎదురవుతాయి. కానీ ఆ మరుసటి రోజు మళ్లీ అదే ఉత్సాహంతో, కొత్త ఆశలతో నిలబడటమే నేను నేర్చుకున్న పాఠం’’ అంటూ సానియా చెప్పే మాటలు మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నాయి.

స్టార్‌గా.. తల్లిగా..

దుబాయ్‌ నుంచి ఇండియా వరకు విస్తరించిన టెన్నిస్‌ అకాడమీలు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు, కామెంట్రీ బాధ్యతలు.. వీటిమధ్య ఏడేళ్ల కుమారుడు ఇజాన్‌ పెంపకం.. ఇవన్నీ ఎలా సమన్వయం చేయగలుగుతున్నారన్న ప్రశ్నకు.. ‘‘ఇది చాలా స్పష్టమైన ప్రాధాన్యతలతో కూడుకున్న విషయం. నా కుమారుడు ఇజాన్‌కు నేను ఒక బలమైన ఆశ్రయంలా ఉండాలని కోరుకుంటాను. కొన్ని రోజులు పని ఒత్తిడి వల్ల వాడిని చూడలేకపోతాను. కానీ, ఆ కష్టమంతా వాడి భవిష్యత్తు కోసమేనని తెలుసు. నేను ప్రయాణాల్లో ఉన్నప్పుడు నా కుటుంబం.. మా నాన్న, అమ్మ లేదంటే చెల్లెలు ఇజాన్‌ వెంట ఉండేలా చూసుకుంటాను. నా గమ్యం ఏంటో నాకు తెలుసు. అక్కడికి చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకాడను’’ అని సానియా తన భవిష్యత్‌ ప్రణాళికలు బయటపెట్టారు.

చిన్నచిన్న అడుగులతోనే లక్ష్యం

ముప్పైలలో ఉన్న మహిళలకు ఫిట్‌నెస్‌ ఒక పెద్ద టాస్క్‌. ముఖ్యంగా ప్రసవం తర్వాత పెరిగిన బరువుపై సానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రసవం తర్వాత మహిళల శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. వెంటనే సన్నబడాలని మీ మీద మీరు ఒత్తిడి పెట్టుకోవద్దు. మీ శరీరానికి సమయం ఇవ్వండి. మొదట ఒక పది నిమిషాల నడకతో ప్రారంభించండి. రోజూ ఏదో ఒక శారీరక కదలిక ఉండేలా చూసుకోండి. జిమ్‌ అయినా, ఆటలైనా, కనీసం వేగంగా నడవడమైనా సరే.. ఈ చిన్నచిన్న అడుగులే మిమ్మల్ని లక్ష్యానికి చేరువ చేస్తాయి’’ అని సానియా తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని బయటపెట్టారు.

Updated Date - Dec 31 , 2025 | 03:46 AM